AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: మంకీపాక్స్ కు ఉపవాసానికి సంబంధమేంటి.. ఆయుర్వేదం ఏం చెబుతోంది..

కరోనా (Corona) తర్వాత ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మరో వైరస్ మంకీపాక్స్. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మనదేశంలో మరణం కూడా సంభవించింది. అంతే కాదు ఇది ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)...

Monkeypox: మంకీపాక్స్ కు ఉపవాసానికి సంబంధమేంటి.. ఆయుర్వేదం ఏం చెబుతోంది..
Monkeypox
Ganesh Mudavath
|

Updated on: Aug 08, 2022 | 8:09 PM

Share

కరోనా (Corona) తర్వాత ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మరో వైరస్ మంకీపాక్స్. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే మనదేశంలో మరణం కూడా సంభవించింది. అంతే కాదు ఇది ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. మంకీపాక్స్ (Monkeypox) అనే వ్యాధి ‘మంకీపాక్స్ వైరస్’ వల్ల వస్తుంది. ఇది‌ కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందిందే. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకూ సోకుతుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, వాపు, కండరాల నొప్పి, అలసట వంటివి ఉంటాయి. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడతాయి. అయితే.. మంకీపాక్స్‌కు కచ్చితమైన ట్రీట్మెంట్‌ లేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి వైద్యులు యాంటీవైరల్‌ మందులను సూచిస్తున్నారు. అంతే కాదు.. ఆయుర్వేదం లో కూడా మంకీపాక్స్ చికిత్స గురించి ప్రస్తావించారు. మంకీపాక్స్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి.. పేషెంట్స్‌ ఉపవాసం ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. భోజనం చేయకుండా ఉంటే మంచిదని, భోజనం చేయకుండా ఉండలేకపోతే కొంతమొత్తంలోనే ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు.

ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించే నీంపత్ర క్వాత్, త్రిఫల క్వాత్‌లు మంకీపాక్స్ వల్ల వచ్చే దద్దుర్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి. వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటితో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. మంకీపాక్స్‌‌‌ మసూరికా వ్యాధిలోకి వస్తుంది. ఈ వ్యాధిలో రోగికి త్రివృత్, అర్గవధ, త్రిఫల మొదలైన పిత్త ఉపశమన మందులు ఉపయోగిస్తారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చ్యవన్‌ప్రాష్, బ్రహ్మ, కూష్మాండ రసాయనాలు, గిలోయ్‌ ఘన్వతి వంటి ఇమ్యునో బూస్టర్ మందులు వాడాలి. అయితే.. మంకీపాక్స్‌ పేషెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిచిడీ తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ సోకిన వారు జంక్‌ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ప్రాసెసింగ్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం