AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Fry Piece Biryani: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోండి.. రెసిపీ మీ కోసం..

ముందుగా చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని దానిని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొంచెం నిమ్మరసం వేసి కొంచెం నూనే పెరుగు, కరివేపాకు వేసి మసాలా ను కలిపి బాగా చికెన్ ను పట్టించి ఒక్కకు పెట్టుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ ను పక్కకు పెట్టి బిర్యానీ మసాలాను రెడీ చేసుకోండి. మిక్సి గిన్నెలో మిర్యాలు, గసగసాలు, అనాసపువ్వు, బిర్యాని ఆకు, జాపత్రి, జీడిపప్పు వేసి వీటిని గ్రైండ్ చేసి ఆ మసాలా పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత రెండు పెద్ద టొమాటలను వేసి గ్రైండ్ చేసి ప్యూరీని పక్కకు పెట్టుకోండి.

Chicken Fry Piece Biryani: రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోండి.. రెసిపీ మీ కోసం..
Chicken Fry Piece Biryani
Surya Kala
|

Updated on: Jan 07, 2024 | 10:52 AM

Share

ఆదివారం వచ్చిందంటే చాలు రోజూ తినే ఫుడ్ కు చెక్ చెప్పి.. డిఫరెంట్ ఫుడ్ తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే చికెన్, మటన్ లవైపు దృష్టి సారిస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది బిర్యానీ లవర్స్ ఉన్నారు. డిఫరెంట్ బిర్యానీలను ఇష్టంగా తింటున్నారు. పిల్లలు , పెద్దలు కూడా రెస్టారెంట్స్ వైపు దృష్టి సారిస్తారు. భిన్నమైన రుచులతో కూడిన ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. ఇంట్లోనే చికెన్ తో రెస్టారెంట్ స్టైల్ లో స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు :

చికెన్ – కేజీ

ఇవి కూడా చదవండి

బియ్యం -ముడు పావులు

జీడి పప్పు – కొంచెం

ఉల్లిపాయలు

టమాటాలు

గరం మసాలా

కసూరి మేతి

ఉప్పు

పసుపు

కారం

కొత్తిమీర

కరివేపాకు

నూనే

అల్లం వెల్లుల్లి పేస్ట్

పచ్చిమిర్చి

దాల్చిన చెక్కలు,

ఏలకులు,

మిరియాలు,

జాపత్రి,

బే ఆకు,

లవంగాలు,

జీలకర్ర

పుదీనా,

పెరుగు

గసగసాలు

తయారీ విధానం: ముందుగా చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని దానిని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొంచెం నిమ్మరసం వేసి కొంచెం నూనే పెరుగు, కరివేపాకు వేసి మసాలా ను కలిపి బాగా చికెన్ ను పట్టించి ఒక్కకు పెట్టుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ ను పక్కకు పెట్టి బిర్యానీ మసాలాను రెడీ చేసుకోండి. మిక్సి గిన్నెలో మిర్యాలు, గసగసాలు, అనాసపువ్వు, బిర్యాని ఆకు, జాపత్రి, జీడిపప్పు వేసి వీటిని గ్రైండ్ చేసి ఆ మసాలా పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి. తర్వాత రెండు పెద్ద టొమాటలను వేసి గ్రైండ్ చేసి ప్యూరీని పక్కకు పెట్టుకోండి.

ఇపుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఐదు స్పూన్ల నూనే వేసుకుని వేడి చేయండి.. ఇప్పుడు నిలువుగా సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకూ వేయించండి. మళ్లీ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి వేయించి ఇప్పుడు టమాటా ప్యూరి ని వేసి ఆయిల్ పైకి తేలే వరకు వేయించండి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించండి. చిన్న మంట మీద చికెన్ ను ఉడికించండి. చికెన్ ఉడికిన తర్వాత రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేయండి.

ఇంతలో మరో స్టవ్ మీద కుక్కర్ పెట్టి.. వేడి చేసి నూనే కొంచెం నేయి కొంచెం వేసి వేడి ఎక్కిన తర్వాత దాల్చిన చెక్కలు, ఏలకులు, మిరియాలు, జాపత్రి, బే ఆకు, లవంగాలు, జీలకర్ర వేసి వేయించి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించి తర్వత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వేయించి.. కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా , పుదీనా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు కడిగి పక్కకు పెట్టుకున్న బియ్యం వేసి తర్వాత ఒక గ్లాస్ రైస్ లో 1 1/2 గ్లాస్ వాటర్ చొప్పున నీరు వేసుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చే వరకూ ఉడికించండి. సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత బిర్యానీలో దగ్గరకు ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత బియ్యం మీద కొద్దిగా స్ప్రెడ్ చేయండి. అనంతరం కుక్కర్ మూతను పెట్టి స్విమ్ లో ఉడికించండి. ఇలా ఒక 20 నిముషాలకు బిర్యానీ రెడీ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ వేడి పోయేవరకూ ఉండి కుక్కర్ మూత తీసుకుని సర్వ చేసుకోండి. వేడి వేడిగా చికెన్ పీసెస్ తో బిర్యానీ ని సర్వ్ చేసుకోండి. రైతాతో అందించండి.. ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తినేస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..