వారెవ్వా.. గోంగూరతో మన శరీరానికి ఇన్ని లాభాలా.. మరి ఇంకెందుకు ఆలస్యం!
ఈ ఆకు కూర రుచిలో పుల్లగా ఉండటమే కాక ఇందులో అనేక పోషకాలు నిండి వున్నాయి. పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ గోంగూర తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇకపై మరింత ఎక్కువ తినేస్తారు..విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. గోంగూరలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.

అన్ని ఆకుకూరల్లో కెల్ల గోంగూరది ప్రత్యేక స్థానం. ఆంధ్రమాతగా పేరోందిన గోంగూర అంటే ఇష్టంలేని వారుండరు. గోంగూర రొయ్యలు, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర బోటి, గోంగూర పప్పు, పులిహోర, పచ్చడి, గోంగూర కారం ఇలా చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు. ఈ ఆకు కూర రుచిలో పుల్లగా ఉండటమే కాక ఇందులో అనేక పోషకాలు నిండి వున్నాయి. పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ గోంగూర తినటం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఇకపై మరింత ఎక్కువ తినేస్తారు..
రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్‌ను పెంచే శక్తి గోంగూరకు ఉంది. గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. కాల్షియం కూడా గోంగూరలో సమృద్ధిగా ఉంటుంది.
కానీ కొందరికి గోంగూర తినడం వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు గోంగూర తినకపోవడమే మంచిది. గోంగూరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. గోంగూరలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. పైగా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








