AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలం దున్నతుండగా దూరంగా ఏదో మెరిసింది..! ఏంటా అని దగ్గరికెళితే ఆ రైతు దశ తిరిగింది..?

వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు. అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి.

పొలం దున్నతుండగా దూరంగా ఏదో మెరిసింది..! ఏంటా అని దగ్గరికెళితే ఆ రైతు దశ తిరిగింది..?
Farmer Found Diamond
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2025 | 8:00 AM

Share

కర్నూల్ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతుకు ఒక వజ్రం దొరికింది. దానిని సోమవారం విక్రయానికి పెట్టగా వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. జిల్లాలోని తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు పొలం పనులు చేస్తుండగా వజ్రం లభించింది. దీంతో ఆ రైతు వజ్రాన్ని దిగుల చింతలకొండలో వేలానికి పెట్టారు. వేలానికి వచ్చిన వ్యాపారులు వజ్రాన్ని కొనడానికి పోటీపడ్డారు. కాగా, రైతు వజ్రాన్ని 18 లక్షల రూపాయిలకు అమ్ముతానని తెలిపారు. దీంతో వ్యాపారులందరూ సిండికేట్ అయి, 8 లక్షల రూపాయిలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రైతు ఎవరికీ అమ్మకుండా వజ్రాన్ని తన వద్దే ఉంచుకున్నాడని తెలిసింది.

చివరకు తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన కొత్త వ్యాపారి రూ.13 లక్షల 50 వేలకు కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. అయితే, ఇదే ఈ మధ్య కాలంలో దొరికిన ఖరీదైన వజ్రంగా స్థానికులు చెబుతున్నారు. వజ్రాలు సాధారణంగా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి రెవెన్యూ పొలాల్లో దొరుకుతుంటాయి. ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ పొలాల్లో వజ్రాలు లభించడం విశేషం అంటున్నారు స్థానికులు.

అటు, అనంతపురం జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తున్నాయి. జిల్లాలోని తట్రకల్లు, రాగులపాడు, గంజికుంట, పొట్టిపాడు, గూళపాళ్యం, కమలపాడు, ఎన్‌ఎంపీ తండాతో పాటూ మరికొన్ని గ్రామాల్లో వజ్రాలు దొరుకుతాయి. వర్షాలు పడగానే కూలీలు, రైతులు, స్థానికులు వజ్రాల వేట సాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం