- Telugu News Photo Gallery Ginger And Turmeric Water On Empty Stomach In This Season Gives Many Benefits In Telugu
Ginger And Turmeric Water: ఈ సీజన్‌లో పరగడుపునే అల్లం, పసుపు నీరు తాగితే బరువు తగ్గడమే కాదు.. ఈ బెనిఫిట్స్ కూడా..
అల్లంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. త్వరలోనే అధిక బరువు సమస్య తగ్గడం నుంచి చెడు కొలొస్ట్రాల్ని దూరం చేసేంత వరకు అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అల్లం నీటిలో కాస్త పసుపు కలిపి తాగితే రెట్టింపుల లాభాలు అంటున్నారు. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని కఫం మొత్తం కరిగిపోతుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 29, 2025 | 7:24 AM

ఉదయాన్నే అల్లం నీరు తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. ఈ నీళ్లను రోజూ పరగడుపునే తాగుతుంటే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది..అల్లం నీటితో మైగ్రేన్ని తగ్గించొచ్చు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అల్లం నీరు చెడు కొలొస్ట్రాల్ని తొలగిస్తుంది. కొలొస్ట్రాల్ లెవల్స్ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా అల్లం నీరు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరకుండా అడ్డుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పసుపులోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి.

బకెట్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలిసి స్నానం చేస్తే, అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. పసుపులోని యాంటి బయోటిక్ లక్షణాలు వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.

గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో అల్లం నీరు అద్భుత ఔషధంగా సహాయపడుతుంది. అల్లం నీరు వాంతులు, వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు తయారి కోసం చిన్న అల్లం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కప్పు నీళ్లు గోరువెచ్చగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిలో అల్లం వేయండి. 10 నిమిషాలు అలా ఉంచండి. నీళ్లల్లో నుంచి అల్లం తీసి, ఆ నీటిని తాగండి.




