AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇంటికి రావాలంటే వణికిపోతున్న జనం..కాలింగ్‌బెల్‌ కొడితే ఈ కుక్క చేతిలో చావే!

ఇంటి పై కప్పు మీద కూర్చుని ఉండే ఆ కుక్క నోటిలో ఎప్పుడూ ఒక ఇటుక రాయిని ప్టటుకుని ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చి డోర్‌ బెల్‌ మోగిస్తే చాలు.. ఆ కుక్క వెంటనే ఇటుకను కిందకి విసిరేస్తుంది. దీంతో హడలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆ ఇంటికి రావాలంటే వణికిపోతున్న జనం..కాలింగ్‌బెల్‌ కొడితే ఈ కుక్క చేతిలో చావే!
Pit Bull Dog
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2025 | 2:33 PM

Share

ప్రపంచంలో వింతైన వ్యక్తులు చాలా మంది ఉంటారు. కొంతమంది అతిగా మాట్లాడేవారు, మరికొందరు అస్సలు మాట్లాడటానికి ఇష్టపడరు. మీరు మాట్లాడటానికి ఇష్టపడకపోతే మౌనంగా ఉండవచ్చు. కానీ, ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేసాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ఒక క్రూరమైన వ్యక్తితో మాట్లాడాలంటే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు…! అవును, దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తి బయట జనాల్ని కలవడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడూ అతను ఇంట్లోనే ఒంటరిగా ఉండేవాడు. కానీ, చుట్టు పక్కల వారు అతడి విషయం తెలియక ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు అనుకుని అతన్ని పలకరించేవారు. అలా ఎవరైనా పొరపాటు అతని ఇంటికి వచ్చి క్షేమ సమాచారం అడిగినా సరే అతడు భరించేవాడు. వారిపై ఒక రేంజ్‌లో రివేంజ్‌ తీర్చుకునే వాడు.. అతన్ని పలకరించేందుకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు తన పిట్‌బుల్‌ డాగ్‌కి వెరైటీ శిక్షణను ఇచ్చాడు..పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా ఎవరైనా ఇంటికి వస్తే కుక్కలు మొరుగుతాయి. కొన్ని కుక్కలు ఎగబడి కరుస్తాయి కూడా. కానీ, ఇక్కడ ఒక్క కుక్కకు ఇంటికి వచ్చిన వారిపై ఇటుకలు విసరడానికి శిక్షణ ఇవ్వబడింది. ఎవరు డోర్ బెల్ మోగించినా సరే.. ఆ వెంటనే వారి తలపై ఇటుకలు విసురుతుంది. ఇంటి పై కప్పు మీద కూర్చుని ఉండే ఆ కుక్క నోటిలో ఎప్పుడూ ఒక ఇటుక రాయిని ప్టటుకుని ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఇంటికి వచ్చి డోర్‌ బెల్‌ మోగిస్తే చాలు.. ఆ కుక్క వెంటనే ఇటుకను కిందకి విసిరేస్తుంది. దీంతో హడలెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

పోలీసులు అతనిపై జంతు హింస అభియోగం మోపారు. కుక్కకు ఇచ్చిన శిక్షణ తప్పు అని, జంతువులకు హానికరం అని పోలీసులు చెబుతున్నారు. కాగా, నోటిలో ఇటుక పట్టుకున్న కుక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జనాలు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..