AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పై‌ప్ లైన్ వేసేందుకు తవ్వుతుండగా బయటపడిన సంచి.. ఓపెన్ చేసి చూడగా

అలీగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిందీ అనూహ్య ఘటన. కువార్సి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో గురువారం నాడు పైప్‌లైన్ వేసే పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఓ కార్మికుడు గడ్డపారతో తవ్వుతుండగా.. ఓ సంచి బయడపడింది. దాన్ని ఓపెన్ చేయగా...

Viral: పై‌ప్ లైన్ వేసేందుకు తవ్వుతుండగా బయటపడిన సంచి.. ఓపెన్ చేసి చూడగా
Treasure Unearthed
Ram Naramaneni
|

Updated on: Jul 28, 2025 | 3:51 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో పై‌ప్ లైన్ కోసం కాలవ తవ్వకం ఓ ఆశ్చర్యకర ఘటనగా మారింది. కువార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో పైప్‌లైన్ పనులు చేస్తున్న సమయంలో ఓ కార్మికుడి గడ్డపారతో తవ్వుతుండగా భూమిలోనుంచి ఓ సంచి బయటపడింది. ఏంటా అని చూడగా ఆ సంచి లోపల పదకొండు బంగారు నాణేలు కనిపించాయి. ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా.. నాణేల గురించి సమాచారం అర్థరాత్రి పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు.

“సమాచారం అందిన వెంటనే మా టీమ్ అక్కడికి వెళ్లింది. మొత్తం పదకొండు బంగారు నాణేల్ని స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది” అని సర్కిల్ ఆఫీసర్ సర్వం సింగ్ చెప్పారు.నాణేలను ముందుగా ఒక స్థానిక ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లి పరీక్షించారు. అక్కడ అవి బంగారంతో తయారయినట్లు కన్ఫామ్ అయింది. వాటిపై ప్రాథమికంగా పర్షియన్ లిపి కనిపించిందని అధికారులు వెల్లడించారు. దీనితో వీటికి చారిత్రక ప్రాధాన్యం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈ వార్త గ్రామంలో వ్యాపించగానే పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకున్నారు. కొంతమంది నాణేలు తమకే చెందుతాయని గొడవకు దిగినట్లు సమాచారం. అయితే పోలీసుల, గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కాయిన్స్ మూలం ఏంటి, వాటి చరిత్ర, విలువ వంటివి పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు నిపుణుల వద్దకు పంపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Gold Coins

Gold Coins

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..