మురికి కాలువ శుభ్రం చేస్తుండగా వినిపించిన వింత శబ్ధాలు..! దగ్గరికెళ్లిన మున్సిపల్ సిబ్బంది పరుగో పరుగు..
మున్సిపల్ కార్మికులకు ఓ కాలువలో 9 అడుగుల పొడవైన రాతి కొండచిలువ ప్రత్యక్షమైంది. అంతేకాదు.. కార్మికులకు కనిపించిన ఆ కొండచిలువ పదుల సంఖ్యలో అక్కడ గుడ్లపెట్టింది. వాటికి రక్షణగా అక్కడే ఉంది. ఈ షాకింగ్ ఘటన ముంబైలో వెలుగుచూసింది. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వర్షాకాలం నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది ముందస్తుగానే కాలువలను శుభ్రం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి ఒక షాకింగ్ సీన్ ఎదురైంది. మురికి కాలువ క్లీన్ చేస్తుండగా, వారికి 9 అడుగుల పొడవైన రాతి కొండచిలువ ప్రత్యక్షమైంది. అంతేకాదు.. కార్మికులకు కనిపించిన ఆ కొండచిలువ పదుల సంఖ్యలో అక్కడ గుడ్లపెట్టింది. వాటికి రక్షణగా అక్కడే ఉంది. ఈ షాకింగ్ ఘటన ముంబైలో వెలుగుచూసింది. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముంబైలోని ఒక కాలువను శుభ్రం చేస్తున్న సమయంలో కార్మికులు భారీ కొండచిలువను చూశారు. తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో 9 అడుగుల ఆడ రాతి కొండచిలువ దాని 22 గుడ్లతో కనిపించింది. దాంతో కార్మికులు వెంటనే స్థానిక పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణి సంరక్షణ బృందం ముందుగా కొండచిలువను పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలివేసింది. ఆ తరువాత కొండచిలువ గుడ్లను కూడా జాగ్రత్త పరిచారు. అవన్నీ ఆరోగ్యంగా పొదిగాయని తెలిసింది.
కొండచిలువ గుడ్లను జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను RAW (రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్) కి అప్పగించారు. ఇక్కడ గుడ్లను మట్టి, కొబ్బరి పీట్, బొగ్గు సంచులలో ఉంచారు. కొన్ని వారాల తర్వాత, 22 గుడ్ల నుండి ఆరోగ్యకరమైన పిల్లలు జన్మించాయని తెలిసింది.. ఈ చిన్న కొండచిలువలు ఇప్పుడు తమ అడవికి తిరిగి రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను @rawwmumbai తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేశారు. ఇది చాలా వైరల్ అవుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ వీడియోలో ప్రజలు అటవీ అధికారులను ప్రశంసించారు. తల్లితో సహా 22 కొండచిలువ పిల్లల్ని రక్షించిన ఫారెస్ట్ రెస్క్యూ అధికారులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. వామ్మో అవన్నీ అక్కడే పుట్టి ఉంటే, డ్రైనేజీలోంచి టాయిలెంట్స్ ద్వారా ఇళ్లలోకి చేరితే పరిస్థితి ఏంటనే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…




