Watch: శ్రావణమాసంలో మహా అద్భుతం..! శివుడి మెడలో ప్రత్యక్షమైన నాగుపాము..
ఈశ్వరుడి మెడలో ఉండే మహా సర్పం వాసుకి. ఇది అన్ని వేళలా స్వామి వారి మెడలో ఉండి ఆయన్ని సేవిస్తూ తరిస్తూ ఉంటుంది. వాసుకి శివుని మెడలో ఉండటం వెనుక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉంటాయి. అలాంటిదే ఇక్కడో దృశ్యం భక్తుల్ని పరవశింపజేస్తోంది. ఎక్కడ్నుంచి వచ్చిన ఒక నాగుపాము మందిరంలోని శివుడి మెడలోకి చేరింది.

ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతోంది. ఈ నెలలో ఆ మహా శివుడిని విశేషంగా పూజిస్తారు భక్తులు. పరమేశ్వరుడితో పాటుగా శివ కుటుంబం, వారి అనుచరులు,వారికి సంబంధించిన ప్రతిదాన్ని పూజిస్తారు. అందులో సర్పాలు కూడా ఉంటాయి. పాములు శంకరుడి ఆభరణాలుగా భావిస్తారు. అందుకే ఎక్కడ చూసినా ఆ నీలకంఠుడి మెడలో నాగుపాము తప్పక కనిపిస్తుంది. ఇది అక్షరాల నిజం చేస్తూ ఇంటర్నెట్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ్నుంచో వచ్చిన ఒక నాగుపాము పాకుతూ శివుడి మెడలోకి చేరింది. ఈ ఘటన వినియోగదారులను విస్మయానికి గురిచేస్తోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. భక్తితో తలలు వంచి నమస్కరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో దావానలంలా వ్యాపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈశ్వరుడి మెడలో ఉండే మహా సర్పం వాసుకి. ఇది అన్ని వేళలా స్వామి వారి మెడలో ఉండి ఆయన్ని సేవిస్తూ తరిస్తూ ఉంటుంది. వాసుకి శివుని మెడలో ఉండటం వెనుక అనేక పురాణ కథలు ప్రచారంలో ఉంటాయి. అలాంటిదే ఇక్కడో దృశ్యం భక్తుల్ని పరవశింపజేస్తోంది. ఎక్కడ్నుంచి వచ్చిన ఒక నాగుపాము మందిరంలోని శివుడి మెడలోకి చేరింది. అందరూ చూస్తుండగానే ఆ పాము బర బరా పాకుతూ శివుడి మెడను చుట్టేసుకుంది. శ్రావణ మాసంలో ఇలాంటి సంఘటన జరగటంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. చూసినందుకు తమ జన్మ ధన్యమైందంటున్నారు. మరికొందరు దీనిని ఎప్పటికీ మరచిపోలేని దృశ్యం అని పేర్కొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, వీడియో మాత్రం ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లైకుల, షేర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి.. పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఆరు లక్షలకు పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. వేలాది మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




