- Telugu News Lifestyle Food Do you eat chicken when you have a fever? These things are for you, Check Here is Details
Chicken in Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మనిషి అన్నాక క్రేవింగ్స్ ఉండటం సర్వ సాధారణం. ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. కొంత మందికి జ్వరంగా ఉన్న సమయంలో కూడా చికెన్ తినాలనే క్రేవింగ్స్ వస్తాయి. మరి ఫీవర్‌గా ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా? ఈ సమయంలో చికెన్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 19, 2025 | 7:51 PM

వాతావరణంలో పరిస్థితులు మారినా, శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. నోరంతా చప్పగా లేదా చేదుగా అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా చాలా మందికి క్రేవింగ్స్ ఉంటాయి. చికెన్ బిర్యానీ, చికెన్‌తో చేసిన రెసిపీలు తింటూ ఉంటారు.

ఇలా జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఇంట్లోని పెద్దలు అయితే జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినకూడదని చెబుతారు. త్వరగా అరగదని మళ్లీ ఫీవర్ ఎక్కువ అవుతుందని అంటారు. మరి నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చికెన్ తినే విధానాన్ని మార్చుకోవాల్సి సూచిస్తున్నారు. సాధారణంగా చికెన్ అంటే మంచిగా మసాలాలు దట్టించి వండుతూ ఉంటారు.

ఇలా మసాలాలతో చేసిన చికెన్ తినకూడదని, కారాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. జ్వరంగా ఉన్న టైమ్‌లో చికెన్ సూప్స్ వంటివి తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.

చికెన్‌తో చేసిన సూప్స్ తాగడం వల్ల త్వరగా జీర్ణం అవడమే కాకుండా.. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరిగి.. జ్వరం నుంచి ఫాస్ట్‌గా కోలుకుంటారు. కాబట్టి క్రేవింగ్స్ ఉంటే.. మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకుని తినాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




