AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuvvula Barfi: టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ నువ్వుల బర్ఫీ.. ఈజీగా ఇలా చేసేయవచ్చు!

ప్రతిరోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. నువ్వులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. నువ్వులతో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. నువ్వులతో చేసే స్నాక్స్‌లో నువ్వుల బర్ఫీ కూడా ఒకటి. దీన్నే నువ్వుల చిక్కీ అని కూడా అంటారు. పిల్లలకు నువ్వులతో చేసే ఆహారాలు అందిస్తూ ఉండాలి..

Nuvvula Barfi: టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ నువ్వుల బర్ఫీ.. ఈజీగా ఇలా చేసేయవచ్చు!
Nuvvula Barfi
Chinni Enni
|

Updated on: Jan 19, 2025 | 7:03 PM

Share

నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. నువ్వుల్లో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. నువ్వులను చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తారు. నువ్వులతో చేసిన వంటలు చాలా రుచిగా ఉంటాయి. నువ్వులతో చేసే స్నాక్స్‌లో నువ్వుల బర్ఫీ కూడా ఒకటి. దీన్నే నువ్వుల చిక్కీ అని కూడా అంటారు. పిల్లలకు నువ్వులతో చేసే ఆహారాలు అందిస్తూ ఉండాలి. నువ్వులతో చేసే ఈ చిక్కీని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

నువ్వుల చిక్కీకి కావాల్సిన పదార్థాలు:

నువ్వులు, బెల్లం లేదా పంచదార, నెయ్యి, యాలకుల పొడి.

నువ్వుల చిక్కీ తయారీ విధానం:

ముందుగా ఓ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో లోతైన గిన్నె తీసుకుని మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం తీసుకుని పాకం పట్టాలి. కొద్దిగా నీటిలో బెల్లం వేసి లేత పాకం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం నెయ్యి, యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వేయించిన నువ్వులను కూడా పాకంలో వేసి అంతా కలిసేంత వరకు తిప్పాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో నెయ్యి రాయాలి. ఈ ప్లేట్ మీద పాకం వేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారాక మీకు కావాల్సిన సైజులో కట్ చేయాలి. అంతే ఎంతో హెల్దీ అంట్ టేస్టీ నువ్వుల చిక్కీ సిద్ధం. ప్రతి రోజూ ఓ చిన్న ముక్క పెద్దలు, పిల్లలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భిణీలు తింటే మరింత మంచిది. బిడ్డ ఎదుగుదలకు సహాయ పడుతుంది.

Follow Us
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..
ఎంత ముదురుగా ఉన్న మటన్ అయినా ఇవి వేస్తే దెబ్బకి మెత్తగా..