AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి ఫిష్ బిర్యానీ ఏ హోటల్లో దొరకదు..! ఒక్క సారి తిన్నా చాలు ఈ ఫిష్ బిర్యానీ మజానే వేరు..!

చేపల బిర్యానీ అనేది ప్రత్యేకమైన రుచిని అందించే వంటకం. చికెన్, మటన్ బిర్యానీ లతో పోలిస్తే ఇది విభిన్నమైన ఫ్లేవర్ ఇస్తుంది. మసాలాలతో మెరినేట్ చేసిన చేపలను సువాసన గల మసాలాలతో కలిసి ఉడికించడం వల్ల దానికో ప్రత్యేకమైన ఘుమ ఘుమలు వస్తాయి.

ఇలాంటి ఫిష్ బిర్యానీ ఏ హోటల్లో దొరకదు..! ఒక్క సారి తిన్నా చాలు ఈ ఫిష్ బిర్యానీ మజానే వేరు..!
Fish Biryani Receipe
Prashanthi V
|

Updated on: Feb 21, 2025 | 1:21 PM

Share

ఇవాళ మనం రుచికరమైన ఫిష్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చికెన్ బిర్యానీకి ఎక్కువ డిమాండ్ ఉన్నా, ఇప్పుడు మటన్, ఫిష్ బిర్యానీలను కూడా బాగా ఇష్టపడుతున్నారు. చేపల బిర్యానీని ప్రత్యేకమైన రుచితో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినేలా ఉండే ఈ ఫిష్ బిర్యానీ తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • చేపలు – 500 గ్రాములు (అపోలో ఫిష్ లేదా మీకు నచ్చిన చేపలు, ముక్కలు పెద్దగా ఉండాలి)
  • నూనె లేదా నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయలు – మసాలా కోసం, వేయించడానికి విడిగా తీసుకోవాలి.
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీస్పూన్
  • టొమాటో – 2 (సన్నగా తరిగినవి)
  • బిర్యానీ మసాలా పొడి – 1 టేబుల్ స్పూన్
  • పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర, పుదీనా – తరిగినవి
  • నిమ్మరసం – 1 టీస్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా

చేపల మసాలా

  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు – 1 టీస్పూన్
  • కారం – 2 టేబుల్ స్పూన్లు
  • సోంపు పొడి – ½ టీస్పూన్

బిర్యానీ రైస్

  • బాస్మతి రైస్ – 3 కప్పులు
  • నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు
  • లవంగాలు – 4
  • ఏలకులు – 4
  • వేడి నీరు – 4 కప్పులు
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం

చేప ముక్కలను శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సోంపు పొడి, ఉప్పు వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు మెరినేట్ చేయాలి. బిర్యానీ కోసం బాస్మతి రైస్ కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి. బిర్యానీ పాత్రలో 3 చెంచాల నెయ్యి వేడి చేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత బియ్యం వేసి కొద్దిసేపు అయ్యాక లవంగాలు, ఏలకులు వేసి వేడి నీరు, ఉప్పు కలిపి మూడొంతుల వరకు ఉడికించాలి. మరో పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి పేస్ట్, టొమాటోలు, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా పొడి, పెరుగు, పసుపు పొడి, సోంపు పొడి వేసి బాగా ముద్దలా అయ్యేవరకు వండాలి.

మెరినేట్ చేసిన చేపలను నూనెలో బాగా వేయించి, మసాలాలో కలిపి మరిగించాలి. మూడొంతుల ఉడికించిన బియ్యాన్ని మసాలాపై పరచి, పై నుంచి వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి తక్కువ మంటపై 10 నిమిషాలు డమ్ పెట్టాలి. చివరగా 10 నిమిషాల తర్వాత బిర్యానీని నెమ్మదిగా మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఇంట్లోనే హోటల్ రుచితో ఫిష్ బిర్యానీ సిద్ధం.

ఈ విధంగా ఇంట్లోనే సులభంగా ఫిష్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. లంచ్, డిన్నర్‌కి ఇదొక బెస్ట్ ఆప్షన్. చేపల రుచి, మసాలాల ఘుమఘుమలతో హోటల్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది. ఒకసారి ట్రై చేసి రుచికరమైన ఫిష్ బిర్యానీని ఎంజాయ్ చేయండి.