AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crispy Prawn Fry: క్రిస్పీ రొయ్యల ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా చేశారంటే లొట్టలేయాల్సిందే..

రొయ్యలతో చాలా మంది రకరకాల వంటకాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ రొయ్యల వంటకాలను రొటీన్‌గా చేసుకుంటే బోరింగ్ గా ఉంటుంది. అయితే కాస్త వెరైటీగా రొయ్యలతో ఫ్రై చేశారంటే ఇంట్లో అందరూ లొట్టలేసుకు తింటారు. రొయ్యల ఫ్రైకి కావల్సిన పదార్ధాలు, దీని తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..

Crispy Prawn Fry: క్రిస్పీ రొయ్యల ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా చేశారంటే లొట్టలేయాల్సిందే..
Crispy Prawn Fry
Srilakshmi C
|

Updated on: Feb 21, 2025 | 1:51 PM

Share

మీకు రొయ్యల వంటకాలంటే ఇష్టమా? ఎప్పుడూ రొయ్యల వంటకాలను రొటీన్‌గా చేసుకుంటూ ఉంటారా? అయితే కాస్త వెరైటీగా రొయ్యలతో ఫ్రై ఈ రోజు ట్రై చేద్దాం. రొయ్యల ఫ్రైకి కావల్సిన పదార్ధాలు, దీని తయారీ విధానం ఇక్కడ తెలుసుకుందాం..

రొయ్యల వేపుడుకి కావలసిన పదార్ధాలు

  • పొట్టు ఒలిచిన రొయ్యలు: పావుకేజీ
  • టొమాటో: ఒకటి
  • అల్లం: 50 గ్రాములు
  • వెల్లుల్లి: ఒకటి
  • ఉల్లిపాయ: ఒకటి
  • పచ్చిమిర్చి: నాలుగు
  • జీడిపప్పు: 25 గ్రాములు
  • గసాలు: 5 గ్రాములు
  • కొబ్బరి: చిన్న ముక్క
  • ధనియాల పొడి: ఒక టేబుల్‌ స్పూన్
  • ఉప్పు: రుచికి తగినంత
  • పసుపు: చిటికెడు
  • కారం: ఒక టేబుల్‌ స్పూన్
  • కొత్తిమీర: చిన్న కట్ట ఒకటి
  • పుదీన: 4 రెమ్మలు
  • నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు
  • నూనె : ఒక టేబుల్‌ స్పూన్
  • లవంగాలు: నాలుగు
  • దాల్చిన చెక్క: చిన్న ముక్క
  • ఏలకులు: నాలుగు

తయారీ విధానం..

ముందుగా ఒక కళాయి తీసుకుని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. అనంతరం శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పది నిమిషాల వరకు ఉడికించాలి. అనంతరం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూను తీసుకుని రొయ్యలలో వేసి కలిపి సన్న మంట మీద వేడి చేయాలి. ఇవి ఇగిరే లోపు కొబ్బరి, ధనియాలపొడి, జీడిపప్పు, గసాలు, రెండు ఏలకులు, రెండు లవంగాలు వేసి మెత్తని పేస్టు చేయాలి.

మరొక బాణలిలో నెయ్యి వేసి కాగిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకుల పొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని, టొమాటో ముక్కలను వేసి దోరగా వేయించాలి. అది వేగిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు మిశ్రమం వేయాలి. మసాలా వేగిన తర్వాత ఇగరపెట్టిన రొయ్యలను వేసి తగినంత నీటిని వేసి ఉడికించాలి. ఉడికేటప్పుడు కొత్తిమీర, పుదీన ఆకులను వేయాలి. మసాలా మొత్తం రొయ్యలకు పట్టేసి ఇగిరే వరకు వేయించి.. ఆ తర్వాత దించేయాలి. అంతే కమ్మని రొయ్యల వేపుడు రెడీ..!

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..