Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచికరమైన బెంగాలీ ఫిష్ కర్రీ రెసిపీ..! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..!

బెంగాలీ ఫిష్ కర్రీను ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించక మానదు. ముఖ్యంగా ఆవాల నూనె, పంచ్‌ఫోరాన్ వంటివి దీనికి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఈ రెసిపీ చాలా సులభంగా తయారు చేయవచ్చు. రుచికరమైన బెంగాలీ చేపల కర్రీను ఇంట్లోనే తక్కువ సమయంలో చేసుకోవచ్చు.

రుచికరమైన బెంగాలీ ఫిష్ కర్రీ రెసిపీ..! ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది..!
Bengali Fish Curry Recipe
Follow us
Prashanthi V

|

Updated on: Mar 10, 2025 | 5:42 PM

మీరు చేపలు అంటే ఇష్టంగా తింటారా..? అయితే బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీని మీకోసం తీసుకొచ్చాను.  ఈ రుచికరమైన కూరను తయారు చేయడం చాలా సులభం రుచి అద్భుతంగా ఉంటుంది. బెంగాలీ ఆహారప్రియులు చేపలను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ ఫిష్ కర్రీకి ప్రత్యేక రుచి టెంపరింగ్ కారణంగా వస్తుంది. ఆవ నూనె, పంచ్‌ఫోరాన్ వంటి పదార్థాలు దీనికి విభిన్నమైన రుచిని ఇస్తాయి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

  • 500 గ్రాముల రోహు లేదా కట్ల చేప
  • 2 టేబుల్ స్పూన్లు ఆవాల నూనె
  • 1 టీస్పూన్ పసుపు పొడి
  • 1 టీస్పూన్ ఎర్ర కారం
  • 1 టీస్పూన్ జీలకర్ర పొడి
  • 2 టేబుల్ స్పూన్లు ఆవాల పేస్ట్
  • 1 టమోటా, సన్నగా తరిగినది
  • 2-3 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ పంచ్‌ఫోరాన్
  • 1/2 టీస్పూన్ గరం మసాలా
  • 1/2 టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్
  • ఉప్పు రుచికి సరిపడా
  • కొత్తిమీర ఆకులు సన్నగా తరిగినవి

తయారీ విధానం

ముందుగా చేపల ముక్కలకు పసుపు, ఉప్పు, కారం రాసి దాదాపు 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆవాల నూనెను పాన్‌లో వేడి చేసి చేపలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికొంత నూనె వేసి పంచ్‌ఫోరాన్ వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ సన్నగా వేగిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి సువాసన వచ్చే వరకు వేయించాలి.

ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఆవా పేస్ట్ వేసి బాగా కలిపి నూనె వేరుగా బయటికొచ్చే వరకు వేయించాలి. తరువాత కొంచెం నీళ్లు పోసి 2-3 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న చేప ముక్కలను గ్రేవీలో వేసి తక్కువ మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి ఈ రుచికరమైన చేప కర్రీని వేడి అన్నంతో వడ్డించి తినండి.