Weight Loss: కాఫీ తాగితే బరువు తగ్గుతారా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

కాఫీ.. ఒత్తిడి తగ్గించడానికి అసలైన ఔషదం. ఉదయాన్నే బ్లాక్ కాఫీ పై ఆధారపడేవారు అధికంగానే ఉంటుంది. కాఫీ ఎనర్జీ బూస్టర్. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి.

Weight Loss: కాఫీ తాగితే బరువు తగ్గుతారా ? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
Coffee
Follow us
Rajitha Chanti

|

Updated on: May 11, 2021 | 12:47 PM

కాఫీ.. ఒత్తిడి తగ్గించడానికి అసలైన ఔషదం. ఉదయాన్నే బ్లాక్ కాఫీ పై ఆధారపడేవారు అధికంగానే ఉంటారు. కాఫీ ఎనర్జీ బూస్టర్. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి ఇది సరైన పానీయం. రోజూ కాఫీ తాగడంవలన క్రమంగా బరువు తగ్గుతుంటారని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. అలాగా రోజూ వ్యాయమానికి ముందు ఆ తర్వాత కాఫీ తాగడం వలన ఉత్సాహంగా ఉంటారు. అలాగే శరీరాన్ని రికవరీ, శరీరంలోని కొవ్వు తగ్గించడంలో సహయపడుతుంది. అలాగే వ్యాయామానికి ఆజ్యం పోసే అద్భుతమైన ఎనర్జీ బూస్టర్ వ్యాయామానికి వెళ్ళే ముందు కనీసం 30 నిమిషాల ముందు కాఫీ తాగడం వలన కొవ్వు తగ్గడానికి సహయపడుతుంది.

శరీరంలోని కేలరీలను తగ్గించడంతోపాటు బరువును కూడా తగ్గించడంలో కాఫీ సహయపడుతుంది. అంతేకాకుండా.. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో అనవసరమైన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఇక పగటి సమయంలో కాఫీ తాగడం వలన అందులో ఉండే కెఫిన్ శక్తిని తగ్గిస్తుంది.. గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది. భోజనానికి ముందు కాఫీ తాగడం వలన ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కొవ్వు తగ్గడం, బరువు తగ్గడం అనేది మీ జీవక్రియ పై ఆధారపడి ఉంటుంది. జీవక్రియను పెంచడానికి అనేక మార్గాలున్నాయి. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన అధ్యయనాలు కెఫిన్, సాధారణంగా BMI ని సమతుల్యం చేయడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుందని నిర్ధారించాయి. దానిలో లోడ్ చేయబడిన యాంటీఆక్సిడెంట్లు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రోజులో ఎక్కువగా కాఫీ తాగడం కూడా ప్రమాదమే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (కొవ్వు పేరుకుపోవడానికి కారణమయ్యేవి), కొత్త కణాల పునరుత్పత్తి చేస్తుంది. కేఫీన్ లో ఉండే పాలీఫెనాల్స్ బరువు తగ్గించడంలో అధిక పాత్ర పోషిస్తాయి.

అయితే బరువు తగ్గడానికి అన్ని రకాల కాఫీలను తాగకూడదు. ముఖ్యంగా ఇందులో చెక్కర ప్యాకెట్స్, నురగ ఉంటే అవి బరువు తగ్గించలేవు. కొవ్వు తగ్గించడం, ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ కాఫీ తాగడం ఉత్తమం. జీర్ణక్రియ ఇబ్బందులు, కెఫిన్ సమస్యలు ఉన్నవారు రోజుకు 2- 3 కప్పులు మాత్రమే తీసుకోవాలి.

Also Read: కరోనా నుంచి కోలుకున్న వారిలో ఆ సమస్యలు…తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి