విటమిన్‌- సి ఆరోగ్యానికి కచ్చితంగా అవసరం.. కానీ అతిగా తీసుకుంటే మాత్రం అనర్థాలే.. తెలుసుకోండి..

Vitamin-C : పెరుగుతున్న కరోనా ముప్పును చూసి ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాలనుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి

విటమిన్‌- సి ఆరోగ్యానికి కచ్చితంగా అవసరం.. కానీ అతిగా తీసుకుంటే మాత్రం అనర్థాలే.. తెలుసుకోండి..
Vitamin C
Follow us

|

Updated on: May 11, 2021 | 2:03 PM

Vitamin-C : పెరుగుతున్న కరోనా ముప్పును చూసి ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవాలనుకుంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంటి నివారణలు, ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, ఇతర ఆహారాన్ని తీసుకుంటున్నారు. కానీ ఏదైనా ఎక్కువగా తీసుకుంటే హానికరం. విటమిన్ సి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో దాని అధిక మోతాదు ఆరోగ్యానికి చెడు చేస్తుంది. ఇంటి నివారణలతో పాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం.

విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. రోజూ ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన తృణధాన్యాలు, బొప్పాయి తినండి. ఇది మీ శరీరంలో విటమిన్-సి లోపాన్ని తొలగిస్తుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలా మంది విటమిన్ సి మాత్రలు వేసుకుంటున్నారు. కానీ ఎక్కువ మాత్రలు తీసుకోవడం మీకు బాధ కలిగిస్తుంది. వృద్ధులు, ఉబ్బసం, డయాబెటిక్, గుండె రోగులు విటమిన్ సి మాత్రలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. విటమిన్ సి రూపంలో తీసుకున్న మందులు హానికరం. అందువల్ల దాని అధిక మోతాదును నివారించాలి. విటమిన్ సి మాత్రలు మూత్రపిండాల్లో రాళ్ళు, విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరికి కారణమవుతాయి. మీకు విటమిన్ సి లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు మాత్రలు తీసుకోండి. కరోనాతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చాలామంది కషాయాలు తాగుతున్నారు. కషాయం తాగడం మీకు ప్రయోజనకరంగా ఉండగా వేసవిలో ఎక్కువగా తాగితే హానికరం. గుండెల్లో మంట, గ్యాస్ వస్తుంది.

మాస్క్‏ను ఎప్పుడూ ధరించడం వలన ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతాయా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Telangana Cabinet Live: తెలంగాణలో లాక్‌డౌన్..? సీఎం కేసీఆర్ నిర్ణయం అదేనా.. మరికాసేపట్లో కేబినేట్ భేటీ

వ్యాక్సిన్ ఫార్ములాను బహిర్గతం చేయండి..! కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచన