AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colored Cauliflower: రంగురంగుల కాలీఫ్లవర్స్‌కు భారీ డిమాండ్.. వీటిని సాగు చేస్తే రైతులకు లాభాల పంటే

తెలుపు కాలీఫ్లవర్ పువ్వుల కంటే రంగు రంగుల కాలీఫ్లవర్‌లో విటమిన్లు, పోషకాలు 25 శాతం ఎక్కువ ఉన్నాయట. అంతేకాదు వీటిలో పిండి పదార్ధాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి కనుక బంగాళా దుంప తినడానికి వీలు లేదు అన్నవారికి కాలీఫ్లవర్‌ బెస్ట్ ఎంపిక. కనుక ఈ రంగురంగుల కాలీఫ్లవర్‌కు పెద్ద నగరాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో వెజిటబుల్ సూప్ తయారీలో రంగురంగుల క్యాలీఫ్లవర్ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Colored Cauliflower: రంగురంగుల కాలీఫ్లవర్స్‌కు భారీ డిమాండ్.. వీటిని సాగు చేస్తే రైతులకు లాభాల పంటే
Colored Cauliflower
Surya Kala
|

Updated on: Jun 15, 2023 | 8:44 PM

Share

కూరగాయల్లో కాలీఫ్లవర్ ది ప్రత్యేక స్థానం. కేబేజీకి జాతికి చెందిన కాలీఫ్లవరు పువ్వులు తెల్లగా ఉంటాయి. పోషక పదార్ధాలు ఎక్కుగా ఉన్న కాలీఫ్లవర్ ను పచ్చిగాను, ఉడకబెట్టుకుని, ఊరుగాయ రూపంలోనూ తింటారు.  అయితే కాలీప్లవర్ అంటే తెల్లగా మాత్రమే ఉంటుందని ప్రజలు అనుకుంటారు. అది నిజం కాదు..  కాలీఫ్లవర్ చాలా రంగుల్లో లభిస్తుంది. గులాబీ, ఆకుపచ్చ, పసుపు రంగు, నారింజ రంగు, బచ్చలిపండు కాలీఫ్లవర్‌లు కూడా మార్కెట్‌లో లభిస్తాయి. అయితే ఈ రంగుల కాలీఫ్లవర్ ధర తెలుపు కంటే ఎక్కువ. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని రైతులు రంగురంగుల కాలీఫ్లవర్‌ను సాగు చేసి.. ఎక్కువ లాభం పొందుతున్నారు.

తెలుపు కాలీఫ్లవర్ పువ్వుల కంటే రంగు రంగుల  కాలీఫ్లవర్‌లో విటమిన్లు, పోషకాలు  25 శాతం ఎక్కువ ఉన్నాయట. అంతేకాదు వీటిలో పిండి పదార్ధాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి కనుక బంగాళా దుంప తినడానికి వీలు లేదు అన్నవారికి కాలీఫ్లవర్‌ బెస్ట్ ఎంపిక. కనుక ఈ రంగురంగుల కాలీఫ్లవర్‌కు పెద్ద నగరాల్లో  చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఫైవ్ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో వెజిటబుల్ సూప్ తయారీలో రంగురంగుల క్యాలీఫ్లవర్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముంబై, ఢిల్లీ, కలకత్తా, పాట్నా, లక్నో, చెన్నై వంటి అనేక మెట్రోలు, పెద్ద పెద్ద నగరాల్లో రంగురంగుల కాలీఫ్లవర్‌కు చాలా మంది కస్టమర్‌లు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, రంగు కాలీఫ్లవర్ సాగు రైతులకు లాభదాయకమైన పంటగా చెబుతున్నారు.

రంగు కాలీఫ్లవర్ సాగుకు 20 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మంచిది

ఇవి కూడా చదవండి

కలర్ కాలీఫ్లవర్ సాగుకు 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో నేల సారం pH 5.5 నుండి 6.5 మధ్య ఉండాలి. రైతు సోదరులు సాగు చేయాలనుకుంటే లోవామ్ నేల (మట్టి, ఇసుక, సేంద్రీయ పదార్థాల మిశ్రమం) నేలలో చేస్తే మంచి దిగుబడి వస్తుంది. విశేషమేమిటంటే రైతు సోదరులు వర్మీకంపోస్టు, ఆవు పేడను ఎరువులుగా వాడితే భూసారం పెరుగుతుంది.

300 క్వింటాళ్ల వరకు దిగుబడి 

రంగు కాలీఫ్లవర్ సాగు ప్రారంభించే ముందు నర్సరీని సిద్ధం చేసుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఈ పంట సాగుకు మంచి సమయం. కాలీఫ్లవర్ మొక్కలను నాటిన తర్వాత క్రమం తప్పకుండా నీరు పెడుతూ ఉండాలి. తద్వారా పొలం ఎల్లప్పుడూ తేమతో నిండి ఉంటుంది. మరోవైపు నాటు వేసిన 100 రోజుల తర్వాత రంగు కాలీఫ్లవర్ పంట పూర్తిగా సిద్దమవుతుంది. పంట దిగుబడికి వస్తుంది. 100 రోజులకు కాలీఫ్లవర్‌ను కోయడం ప్రారంభించవచ్చు. ఒక హెక్టారులో రంగు కాలీఫ్లవర్ సాగు చేస్తే 300 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. దీన్ని విక్రయించడం ద్వారా రూ.8 లక్షల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..