AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Juice Benefits: కొత్తిమీర జ్యూస్‌ రోజూ తాగితే ఈ సమస్యలన్నీ మాయం..! ప్రయోజనాలు తెలిస్తే..

మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కిడ్నీ టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహజమైన మార్గాలు అద్భుత ఫలితానిస్తాయి. అందుకోసం కొత్తిమీర ఆకులతో తయారు చేసిన నీరు కిడ్నీ టాక్సిన్స్ ను సులభంగా తొలగించి కిడ్నీ వ్యాధులను నయం చేస్తుంది.

Coriander Juice Benefits: కొత్తిమీర జ్యూస్‌ రోజూ తాగితే ఈ సమస్యలన్నీ మాయం..! ప్రయోజనాలు తెలిస్తే..
Coriander Juice
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2024 | 7:13 AM

Share

కొత్తిమీర.. దాదాపు అన్ని వంటలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆహార పదార్ధం. ఇది Apiaceae మొక్కల కుటుంబానికి చెందినది. కొత్తిమీర ఆకు, కాండం, వేరు అన్నీ ఔషధాలే. ఈ కొత్తిమీర ఆకు కిడ్నీ టాక్సిన్స్ ను తొలగించి కిడ్నీ వ్యాధులను నయం చేస్తుంది. రోత్తిమీర ఆకులు మన మూత్రపిండాలకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మీ కిడ్నీలను శుభ్రం చేయడానికి మీరు కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అందులో భాగంగా కొత్తిమీర కిడ్నీ టాక్సిన్‌లను బయటకు పంపడంలో సహాయపడతాయి. కొత్తిమీరలో యాంటీమైక్రోబయల్, యాంటీ-ఎపిలెప్టిక్, యాంటిడిప్రెసెంట్, యాంటీమ్యూటాజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలు మూత్రపిండాల పనితీరుకు ఉపయోగపడతాయి. ఇది డయేరియాకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా సహాయపడుతుంది.

కొత్తిమీర నీటిని ఎలా తయారు చేయాలి:

ముందుగా కొత్తిమీర ఆకులను తీసుకోండి. దీన్ని బాగా కడిగి జల్లెట్లో ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకులను పౌడర్‌గా చేసి నిల్వచేసుకోవచ్చు. కావాల్సినప్పుడు ఒక గ్లాస్‌ నీటిలో స్పూన్‌ పౌడర్‌ కలిపి10 నిమిషాలు మరిగించి చల్లారనివ్వాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి అందులో నిమ్మరసం పిండుకుని రోజూ తాగాలి. ఈ కొత్తిమీర నీటిని రెగ్యులర్ గా తాగడం వల్ల కిడ్నీ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

కొత్తిమీర జ్యూస్ చేయడానికి కావలసిన పదార్థాలు:

పచ్చి కొత్తిమీర చిన్న కట్ట, ఒక నిమ్మకాయ రసం, ఉప్పు, నీరు

కొత్తిమీర రసం తయారు చేసే విధానం:

కొత్తిమీర జ్యూస్ చేయడానికి ముందుగా కొత్తిమీర ఆకులను తీసుకుని శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి. దీని తర్వాత మీరు శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత దానిని కత్తితో కట్ చేసి, ఆపై గ్రైండర్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లా సిద్ధం చేసుకోవాలి. దీని తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు పోసి మళ్లీ రుబ్బుకోవాలి. ఒక స్టయినర్ తీసుకొని రసాన్ని ఫిల్టర్ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో నిమ్మరసం వేసి సర్వ్ చేయాలి.

కొత్తిమీర ఆకు నీరు తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:

1. జీర్ణక్రియ: కొత్తిమీర ఆకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. కొత్తిమీర ఆకులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

2. శరీరం నిర్విషీకరణ: ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

3. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది: కొత్తిమీర ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకు నీటిని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

5. కీళ్ల వాపు, నొప్పుల నుండి ఉపశమనం: శోథ నిరోధక గుణాలు పుష్కలంగా ఉన్న కొత్తిమీర ఆకు నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కీళ్ల వాపు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..