AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొక్కజొన్న కంకితో ఇన్ని లాభాలా..! విస్కీ తయారీలో వాడతారని మీకు తెలుసా..? స్వీట్ కార్న్‌ గురించి అసలు నిజాలు..

Benefits with Corn: మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే షాకవుతారు. కంకి తినడం వల్ల మనకు తెలియకుండానే శరీరానికి చక్కటి పోషకాలను

మొక్కజొన్న కంకితో ఇన్ని లాభాలా..!  విస్కీ తయారీలో వాడతారని మీకు తెలుసా..? స్వీట్ కార్న్‌ గురించి అసలు నిజాలు..
uppula Raju
|

Updated on: Mar 11, 2021 | 4:10 PM

Share

Benefits with Corn: మనం టైంపాస్‌కి తినే మొక్కజొన్న కంకిలో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే షాకవుతారు. కంకి తినడం వల్ల మనకు తెలియకుండానే శరీరానికి చక్కటి పోషకాలను అందిస్తున్నాం. ఇక మొక్కజొన్న గురించి అసలు నిజాలు తెలిస్తే ఇవ వదిలిపెట్టరు. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పడు కాల్చిన మొక్కజొన్న కండెలను తింటే ఆ టేస్టే వేరప్ప. అలాగే థియేటర్‌లో పాప్ కాన్ తింటూ సినిమా చూస్తే ఆ మజాయే వేరు. ఇక ఇప్పడు లేటెస్ట్‌గా ఉడకబెట్టిన కంకికి ఉప్పు, నిమ్మరసం అదిమి తినడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అయితే ఇన్ని రకాలుగా తినే మొక్కజొన్నతో శరీరానికి ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం..

మొక్కజొన్నలో విటమిన్‌ బి12, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహంలో ఎర్రరక్త కణాలను ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఒక కప్పు మొక్కజొన్న గింజల ద్వారా 125 క్యాలరీలు, 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 4 గ్రాముల ప్రొటీన్లు, 9 గ్రాముల సూక్రోజు, రెండు గ్రాముల కొవ్వు, 75 మిల్లీగ్రాముల ఐరన్‌ లభిస్తుంది. అథ్లెటిక్‌ క్రీడాకారులకు, జిమ్‌లో చెమటలు చిందించేవారికి ఇది శక్తిదాయకంగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో బి విటమిన్‌ కుటుంబానికి చెందిన బి1, బి5లతో పాటు విటమిన్‌ సి కూడా ఉంటుంది.

మొక్కజొన్నలో ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌, ఐరన్‌, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు పొటాషియం, కాల్షియం కూడా తగు పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల బీపీ, గుండె జబ్బులు, అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారిస్తుంది. సోడియం (ఉప్పులో ఒక భాగం) తక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు ఉన్నవారికి, రక్తపోటు ఉన్నవారికి మొక్కజొన్న చాలా మంచి పుడ్.

అమెరికన్‌ డయాబెటిస్‌ అసోసియేషన్‌ కూడా మధుమేహం సమస్య ఉన్నవారికి మొక్కజొన్న మేలు చేస్తుందని ప్రకటించింది. రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో మొక్కజొన్న ఉండేలా చూడాలని వైద్యులు చెబుతున్నరు. విటమిన్‌ బి1, బి5, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండటంవల్ల వ్యాధులపై పోరాడటంలో ఉపయోగం ఉంటుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదం చేస్తున్నందున రక్తంలో షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. మధుమేహులకు ఇది మేలు చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

గర్భందాల్చినవారికి మొక్కజొన్న చేసే మేలు ఇంతా అంతా కాదు. గర్భిణికి, గర్భస్త శిశువుకు కూడా మొక్కజొన్న వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. మొకజొన్న గింజలను విస్కీ తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. మొక్కజొన్నను బయోగ్యాస్‌ ప్లాంట్లలో వినియోగిస్తున్నారు. మోటారు వాహనాలకు ఇంధన తయారీలో ఎథనాల్‌గా దీనిని వినియోగిస్తారు. ఇంకా అనేక పారిశ్రమిక ఉత్పత్తులో కూడా మొక్కజొన్న వినియోగం గణనీయంగా ఉంటోంది.

Ola Elecric Scooter : సింగిల్ చార్జిపై 240 కిలోమీట‌ర్లు.. త్వరలో ఓలా నుంచి స్మార్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Mahashivratri Special-2021:శివుడు అభిషేక ప్రియుడు.. కానీ ఒక్కో అభిషేకానికి ఒక్కో ఫలితం ఉంటుందని మీకు తెలుసా..