క్యాట్ ఫిష్ తింటున్నారా? రోగాలు వద్దన్నా వస్తాయి.. జాగ్రత్త..!
క్యాట్‌ఫిష్ చూసేందుకు కొర్రమీను చేపను పోలి ఉండే ఈ చేపకు మీసాలు ఉంటాయి. ఈ మీసాలను తీసేసి కొరమీను పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు కొందరు అమ్మకందారులు. అది గుర్తుపట్టలేని అమాయక ప్రజలు కాసులు పెట్టి కొనుకున్ని మరీ రోగాలు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..క్యాట్ ఫిష్.. ఇది కేవలం
చాలామంది సీ ఫుడ్ అంటే ఇష్టంగా తింటుంటారు. మాంసాహారులు చేపలు మంచి ఆహారంగా భావిస్తారు. అయితే చేపలను తినడం మంచిదే అయినప్పటికీ అన్ని చేపలు తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో కొన్ని తినకూడని చేపలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అలాంటి తింటే మన ఆరోగ్యం కచ్చితంగా పాడవుతుందని హెచ్చరిస్తున్నారు. తినకూడని చేపలలో క్యాట్ ఫిష్ ఒకటి. చాలామంది తెలిసి తెలియక క్యాట్ ఫిష్ ను ఎక్కువగా తింటుంటారు. అయితే, ఇది చాలా డేంజర్ అంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..
క్యాట్‌ఫిష్ చూసేందుకు కొర్రమీను చేపను పోలి ఉండే ఈ చేపకు మీసాలు ఉంటాయి. ఈ మీసాలను తీసేసి కొరమీను పేరుతో ఎక్కువ ధరకు అమ్ముతుంటారు కొందరు అమ్మకందారులు. అది గుర్తుపట్టలేని అమాయక ప్రజలు కాసులు పెట్టి కొనుకున్ని మరీ రోగాలు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..క్యాట్ ఫిష్.. ఇది కేవలం కుళ్ళిన మాంసాన్ని తిని పెరుగుతుందట. ఇది 6 నెలల్లోనే 20 కేజీల వరకు బరువు పెరుగుతుందట. నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే, క్యాట్ ఫిష్ లోనూ కొరమీను లానే ఒకే ముళ్ళు ఉంటుందట. కానీ, ఈ చేపలను తినడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. క్యాట్ ఫిష్ లో ఉండే ఒమేగా సిక్స్ ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతింటుందని, దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. అంతేకాదు.. క్యాట్ ఫిష్ దవడ కింద ఉండే ముళ్ళు తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని సూచిస్తున్నారు. కుళ్లిపోయిన వ్యర్ధాలను తిని పెరిగే ఈ చేపలను తింటే శరీరంలో కొత్త కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందని, ఈ చేపల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..