AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఏనుగు బీభత్సం.. ఊరిమీద పడి విధ్వంసం…భయంతో వణికిపోయిన ఊరి జనం

తర్వాత అంతే ఆవేశంగా ఊళ్లోకి పరిగెత్తింది. రోడ్డు పక్కన ఉన్న ఒక ఆటోను కూడా తోసేసింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును కూడా తోసేయాలని ప్రయత్నించింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని రివర్స్ చేసి  చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. అలాగే ముందుకు వెళ్లిన ఏనుగు.. గ్రామంలోని ఇళ్లు, గుడిసెలను ధ్వంసం చేసింది. అంతటితో ఆగలేదు..

Watch: ఏనుగు బీభత్సం.. ఊరిమీద పడి విధ్వంసం...భయంతో వణికిపోయిన ఊరి జనం
Enraged Elephant
Jyothi Gadda
|

Updated on: Aug 08, 2024 | 8:05 PM

Share

ఏనుగులు చూసేందుకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాయి. వాటి రూపం మాత్రం భీకరంగా ఉంటుంది. వాటి ఆగ్రహం కూడా అంతే భయానకంగా ఉంటుంది. ఏనుగులు తెలివిలో మాత్రం వెరీ స్మార్ట్‌ అని చెప్పాలి. సోషల్ మీడియాలో తరచూ ఏనుగుల వీడియోలు చూస్తుంటాం. జూలో, సఫారి కోసం వెళ్లిన పర్యాటకులు అప్పుడప్పుడు ఏనుగు నుంచి తప్పించుకునే ఘటనలు కూడా చూస్తుంటాం. సోషల్ మీడియాలో ఓ ఏనుగు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఏనుగు చేసిన విధ్వంసం చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ వీడియోలో ఒక పెద్ద ఏనుగు అటవీ సమీప గ్రామంలోకి చొరబడింది. వస్తూ వస్తూనే ఎంతో ఆవేశంగా దూసుకొచ్చింది. రోడ్డుపై వేగంగా వచ్చే క్రమంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన బైకును ఒక్క తోపు తోసేసింది. దెబ్బకు ఆ బైకు దూరంగా ఎగిరిపడింది. తర్వాత అంతే ఆవేశంగా ఊళ్లోకి పరిగెత్తింది. రోడ్డు పక్కన ఉన్న ఒక ఆటోను కూడా తోసేసింది. ఆ తర్వాత రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును కూడా తోసేయాలని ప్రయత్నించింది. అయితే అందులో ఉన్న డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని రివర్స్ చేసి  చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. అలాగే ముందుకు వెళ్లిన ఏనుగు.. గ్రామంలోని ఇళ్లు, గుడిసెలను ధ్వంసం చేసింది. అంతటితో ఆగలేదు..ఓ రేకుల ఇంట్లోకి వెళ్లి ఇంటికి ఒకవైపు గోడను మొత్తం కూల్చేసింది. ఇదంతా దూరం నుంచి కొందరు స్థానికులు వీడియోలు తీశారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా.. వామ్మో..ఈ ఏనుగు ఊరిపై పగబట్టిందా ఏంట్రా బాబోయ్‌ .. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా వ్యూస్‌ రాగా, వేలాది మంది వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..