Radish Benefits: వాసన చూసి ముల్లంగిని పక్కన పెడుతున్నారా? అయితే మీరు ఈ అద్భుత ప్రయోజనాలు కోల్పోయినట్లే
ముల్లంగిని నేరుగా తినలేనప్పటికీ, పరోటా, పప్పు, సాంబార్ లేదా సలాడ్‌లో దీనిని ఉపయోగించవచ్చు. నల్ల ముల్లంగి, దాని ఆకులు కామెర్లు చికిత్సకు చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది శరీరంలో అదనపు బిలిరుబిన్‌ను నివారిస్తుంది.
ముల్లంగిని చూసి చాలామంది ముఖం చిట్లించుకుంటారు. ఇందుకు దాని వాసనే ప్రధాన కారణం. అయితే దీనిలో బోలెడు ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసే శక్తి ముల్లంగికి ఉంది. ముల్లంగిని నేరుగా తినలేనప్పటికీ, పరోటా, పప్పు, సాంబార్ లేదా సలాడ్‌లో దీనిని ఉపయోగించవచ్చు. భారతదేశంలో చలికాలంలో ముల్లంగి మార్కెట్‌లో పెద్ద మొత్తంలో దొరుకుతుంది. ముల్లంగి మన కాలేయంతో పాటు కుడుపును శుభ్రపరిచి నిర్విషీకరణకు సహాయపడుతుంది. నల్ల ముల్లంగి, దాని ఆకులు కామెర్లు చికిత్సకు చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు బిలిరుబిన్‌ను తొలగిస్తుంది. ఇది మన రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని సల్ఫర్ కంటెంట్ హైపోథైరాయిడిజమ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ముల్లంగి మన ఎర్ర రక్త కణాల నష్టాన్ని నియంత్రిస్తుంది. అలాగే రక్తానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది.
ముల్లంగిని రోజువారీ సలాడ్ తీసుకోవడంలో తింటే ఇది ఫైబర్‌లను అందిస్తుంది. తద్వారా మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన నీటి స్థాయులను అందిస్తుంది. ముల్లంగి ఆంథోసైనిన్‌లకు మంచి మూలం. ఇది మన గుండెను సక్రమంగా పని చేసేలా చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ మరియు ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ముల్లంగి మీ శరీరానికి పొటాషియంను కూడా అందిస్తుంది, ఇది మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది . అలాగే రక్త ప్రవాహాన్ని అదుపులో ఉంచుతుంది, ప్రత్యేకించి మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తెలిస్తే. ఆయుర్వేదం ప్రకారం, ముల్లంగి రక్తంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతుంది.
ఇమ్యూనిటీని పెంచేలా..
ముల్లంగిలో విటమిన్ సి అధికంగా ఉన్నందున, ఇది జలుబు, దగ్గు నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే మీ ప్రాథమిక రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్, వాపు సమస్యలను అడ్డుకుంటుంది. ముల్లంగి కొల్లాజెన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇది మన రక్త నాళాలను పెంచుతుంది. అలాగే ఆర్టిరియోస్క్లెరోసిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే ఆమ్లత్వం, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వికారం మొదలైన వాటిని నయం చేయడంలో సహాయపడుతుంది. ఇక ఎర్ర ముల్లంగిలో విటమిన్ ఇ, ఎ, సి, బి6 , కె, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్ , మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ ముల్లంగి రసం తాగితే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి