AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey Benefits: తేనెతో ఇది కలిపి తీసుకుంటే ప్రయోజనాలెన్నో.. ఈ 6 వ్యాధులకు చెక్..

Health Tips: ఇందులో రాగి, విటమిన్ బి1, బి6, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తేనెలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

Honey Benefits: తేనెతో ఇది కలిపి తీసుకుంటే ప్రయోజనాలెన్నో.. ఈ 6 వ్యాధులకు చెక్..
Nutmeg And Honey Health Tips
Venkata Chari
|

Updated on: Dec 14, 2022 | 9:15 AM

Share

Benefits Of Nutmeg And Honey: జాజికాయ ఒక మసాలా దినుసు. ఇది ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అవును, ఎందుకంటే జాజికాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా జాజికాయను తేనెతో కలిపి తీసుకున్నారా? జాజికాయను తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అవును, ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే జాజికాయలో రాగి, విటమిన్ బి1, బి6, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే తేనెలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు ఎ, బి, సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి జాజికాయ, తేనె వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జాజికాయ, తేనె మిశ్రమం తీసుకోవడం ద్వారా ఈ 6 సమస్యలను అధిగమించవచ్చు..

1. ఆర్థరైటిస్‌ పేషంట్లకు మేలు..

జాజికాయ, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం అర్థరైటిస్ విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కీళ్లనొప్పుల వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడే ఎన్నో పోషకాలు ఈ మిశ్రమంలో ఉన్నాయి. ఇందుకోసం జాజికాయ పొడిని తేనెలో కలిపి సేవించడం మంచిది.

ఇవి కూడా చదవండి

2. రోగనిరోధక శక్తి పెరగడంలో..

జాజికాయ, తేనెలో యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే, ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీనివల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండొచ్చు.

3. నిద్రలేమికి చెక్..

జాజికాయ, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం నిద్రలేమి విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మిశ్రమంలో ఇటువంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. నిద్రలేమిని తగ్గిస్తుంది.

4. మొటిమలు రాకుండా..

మొటిమల సమస్య సర్వసాధారణమే. కానీ, మొటిమల విషయంలో జాజికాయ, తేనె కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య దూరమవుతుంది.

5. పొట్టకు మంచిది..

జాజికాయ, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పొట్టకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

6. బరువును తగ్గించడంలో..

పెరుగుతున్న మీ బరువు గురించి ఆందోళన చెందుతూ, బరువు తగ్గాలని కోరుకుంటే, మీరు జాజికాయ, తేనె మిశ్రమాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు బరువును అదుపులో ఉంచుతాయి.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. ఇవి వైద్య అభిప్రాయానికి ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా పద్ధతిని పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..