Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain In Winter: శీతాకాలంలో బరువు పెరుగకుండా ఉండడం ఎలా? ఈ ఐదు చిట్కాలతో అధిక బరువు సమస్య ఫసక్

చలికాలం అంటేనే సాధారణంగా సోమరితనంగా భావించే సమయం. ఈ సీజన్ లోనే చాలా మంది తమ జిమ్ మెంబర్ షిప్ లను వదులుకుంటారు. దుప్పట్లో ముడుచుకుని పడుకుంటారు. అయితే ఇదంతా హాయిగా ఉన్నప్పటికీ ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ లేక విపరీతంగా బరువు పెరుగుతుంటారు.

Weight Gain In Winter: శీతాకాలంలో బరువు పెరుగకుండా ఉండడం ఎలా? ఈ ఐదు చిట్కాలతో అధిక బరువు సమస్య ఫసక్
Food
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 14, 2022 | 12:00 PM

చలికాలం అంటేనే సాధారణంగా సోమరితనంగా భావించే సమయం. ఈ సీజన్ లోనే చాలా మంది తమ జిమ్ మెంబర్ షిప్ లను వదులుకుంటారు. దుప్పట్లో ముడుచుకుని పడుకుంటారు. అయితే ఇదంతా హాయిగా ఉన్నప్పటికీ ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ లేక విపరీతంగా బరువు పెరుగుతుంటారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడానికైనా పెరగడానికైనా డైట్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. సరైన రీతిలో పోషకాలు లేని ఆహారం తీసుకుంటే అది మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపుతుంది. 

శీతాకాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఇవి తినాల్సిందే

  • శీతాకాలంలో ఫైబర్ ఎక్కువుగా ఉండే ఆహారం తీసుకోవడం మేలు. దీని ద్వారా నిర్ధిష్ట భాగాల్లో కొవ్వు పేరుకు పోకుండా సాయం చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, తృణ ధాన్యాల్లో అధిక ఫైబర్ ఉంటుంది. వీటిని తీసుకుంటే మేలు.
  • శీతాకాలంలో దుంప పదార్థాలతో చేసిన ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉండవచ్చని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఎక్కువుగా దొరికే చిలకడ దుంపలు, బీట్ రూట్, క్యారెట్ వంటి దుంప పదార్థాలు తినాలని సూచిస్తున్నారు. 
  • చలికాలంలో నువ్వులను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మేలు జరుగుతుంది. నువ్వుల్లు మంచి క్యాలరీలతో నిండి ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్, జింక్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిలను నిర్ధారిస్తుంది. సో స్నాక్ ఐటమ్ కింద నువ్వులతో చేసే పదార్థాలను తీసుకుంటే బరువు పెరగకుండా ఉండవచ్చు. 
  • శీతా కాలంలో ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. ప్రోటీన్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, గుడ్డు, చేపలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 
  • నారింజ, కివీస్, నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు వంటి పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇవి ఫైటోన్యూట్రియెంట్స్, ఫైబర్ కు పుష్కలమైన వనరులు, ఇవి తినడం ద్వారా అధికంగా బరువు పెరగకుండా సాయపడతాయి. 

ఇవి తిన్నారో? ముప్పు తప్పదు

  • శీతాకాలంలో చక్కెర ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో చక్కెర ఉన్న ఆహారాన్ని సహజంగానే తీసుకోవాలనిపిస్తుంది. అయితే సంబంధిత ఆహారం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి శీతాకాలంలో చక్కెర లేని లేదా తక్కువుగా ఉండే వేడి పానియాలను తీసుకోవడం మంచిది.
  • ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉన్న స్నాక్స్ కు దూరంగా ఉండడం మేలు. వీటి బదులు తాజా పండ్లు, విజిటేబుల్ జ్యూస్ లాంటి తీసుకోవాలి.
  • సహజంగానే మటన్ అధిక కొవ్వుతో ఉంటుంది. అయితే మటన్ ను చలికాలంలో తినడం వల్ల చాలా హాని చేస్తుంది. అందువల్ల మటన్ కు దూరంగా ఉండడం మేలు.
  • శరీరంలో వెచ్చదనం కోసం చాలా మంది శీతాకాలంలో అధికంగా మద్యాన్ని వినియోగిస్తారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు. మద్యాన్ని ఎక్కువ తీసుకుంటే జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. 
  • శీతాకాలంలో నిల్వ చేసిన ఆహారాన్ని లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే మంచిది. నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకుంటే జలుబు, రోగనిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారు ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంది. 

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
ఆర్ఎస్ఎస్ భారతీయ సంస్కృతి వట వృక్షంః ప్రధాని మోదీ
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
కిర్రాక్ లుక్‌తో స్టన్నింగ్ ఫీచర్స్‌తో ఈవీ కార్లు..త్వరలోనే లాంచ్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
DC vs SRH: మిచెల్ స్టార్క్ పాంచ్ పటాకా.. 163కే హైదరాబాద్ ఆలౌట్
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన హైలెట్స్...
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
పక్కా వెజిటేరియన్ ఫుడ్స్‌.. టేస్ట్ మాత్రం నాన్వెజ్‌లా ఎందుకుంటాయ్
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
జ‌గ్గారెడ్డి వార్ ఆఫ్ ల‌వ్ పోస్టర్ రిలీజ్..
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
నిండా ముంచిన డేటింగ్‌ యాప్‌.. రూ.6.5 కోట్ల మోసం..షాకింగ్ విషయాలు
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
వామ్మో ఇదెక్కడి వింత.. తలలేని కోడి ఏకంగా 18 నెలలు బతికింది..!
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
స్పిరిట్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!
ఏఐ వచ్చినా ఈ ఉద్యోగాలకు ఢోకా లేదు.. తేల్చిచెప్పిన బిల్ గేట్స్..!