Garlic Benfits: వెల్లుల్లి క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తుందా? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయ్యండి…

శతాబ్దాలుగా భారతదేశ వంటకాల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉంటుంది. దాని యాంటీ బాక్టీరియల్ మరియు క్రిమినాశక లక్షణాల కారణంగా దీన్ని ఉపయోగించేవారు. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ దాని సుగుణాలకు కారణం అవుతుంది.

Garlic Benfits: వెల్లుల్లి క్యాన్సర్ సమస్యలను దూరం చేస్తుందా? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయ్యండి…
Garlic Water
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 14, 2022 | 11:10 AM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు..అనే సామెతను మనం  వింటూ ఉంటాం. అయితే వెల్లుల్లి చేసే మేలు కూడా అలాంటిదే అంటున్నారు వైద్య నిపుణులు. శతాబ్దాలుగా భారతదేశ వంటకాల్లో తప్పనిసరిగా వెల్లుల్లి ఉంటుంది. యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాల కారణంగా దీన్ని ఉపయోగించేవారు. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ దాని సుగుణాలకు కారణం అవుతుంది. అలాగే భాస్వరం, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో పెద్ద మొత్తంలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ ఉన్నాయి. సుగంధ రుచితో పాటు, వెల్లుల్లి మానవ శరీరానికి అసాధారణమైన ప్రయోజనాలను అందిస్తుంది.

వెల్లుల్లిని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోవడానికి  ఈ 10 కారణాలు చూడండి.

  1.  వెల్లుల్లి తినడం వల్ల క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దానిలోని అనేక బయోయాక్టివ్ అణువులు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. వెల్లుల్లి యాంటీక్యాన్సర్ చర్యలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా మరిన్ని పరిశోధనలు అవసరం
  2.  వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే వెల్లుల్లి హృదయ నాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
  3.  వెల్లుల్లి తరచూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే కడుపులో హానికరమైన బ్యాక్టిరియా పెరగకుండా చేస్తుంది.
  4.  పచ్చి వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ప్రతి రోజు ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 
  5.  వెల్లుల్లి వాడడం వల్ల అధిక కొలెస్ట్రాల్ నుంచి బయటపడవచ్చని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వెల్లుల్లి వినియోగం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిల మధ్య పరస్పర సంబంధాన్ని గుర్తించడానికి మరింత పరిశోధన అవసరం.
  6.  వెల్లుల్లి నూనె రాసుకోవడం ఆర్థరైటిస్ ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. వెల్లుల్లి నూనెలో యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. 
  7.  వెల్లుల్లిలో వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుంచి రక్షించగల సామర్థ్యం ఉంటుంది. దాని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఇటీవల శాస్త్రీయ పరిశోధన ద్వారా చూపబడింది,
  8.  వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ముఖంపై మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మీ ముఖాన్ని శుభ్రపరుస్తాయి.
  9.  వెల్లుల్లి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కడుపులో మంటతో పోరాడుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. వెల్లుల్లిలో 20 కంటే ఎక్కువ పాలీఫెనోలిక్ భాగాలు ఉన్నట్లు తేలింది, ఇది ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లలో అధికంగా ఉండే ఆహారాలలో ఒకటిగా నిలిచింది.
  10. వెల్లుల్లి తరచూ తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్ల లోని జిగటను తగ్గిదిస్తుంది. తద్వారా రక్తం గడ్డ కట్టే సమస్య నుంచి బయటపడవచ్చు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే