AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radish for health: ముల్లంగితో మామూలుగా ఉండదు.. తింటే ఇక అంతే! షాకింగ్ విషయాలు మీకోసం..

మీ కడుపును కడిగేస్తుంది. అనవసరపు గ్యాసెస్ ను అదుపు చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ మెరుగయ్యేలా చేస్తుంది. ఎసిడిటీ, ఒబెసిటీ, గాస్ట్రిక్ సమస్యల భరతం పడుతుంది.

Radish for health: ముల్లంగితో మామూలుగా ఉండదు.. తింటే ఇక అంతే! షాకింగ్ విషయాలు మీకోసం..
Radish
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 14, 2022 | 12:58 PM

Share

ముల్లంగి.. సాధారణంగా తినడానికి ఇష్టపడని ఆహార పదార్థాల జాబితా రూపొందిస్తే మొదటి వరసలో ఇదే ఉంటుంది చాలా మందికి. దీనికి ప్రధాన కారణంగా దానిపై సరైన అవగాహన లేకపోవడమే. కానీ దాని వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం తినకుండా ఉండలేరు. ముఖ్యంగా జీర్థ వ్యవస్థకు సంబంధించి అది చేసే మేలు మరే ఇతర ఆహార పదార్థాలు చేయలేవు. ఔషధాల గని.. ఒక రకంగా ఆహార పదార్థాల్లో రారాజు వంటి ముల్లంగిని రోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

చాలా రకాలు ఉన్నాయి..

చాలా రకాల ముల్లంగి మనకు అందుబాటులో ఉన్నాయి. తెలుపు, పింక్, ఎరుపు, నలుపు రకాల ముల్లంగిలో మార్కెట్లో కనిపిస్తుంటాయి. వీటిలో తెల్ల ముల్లంగి ఎక్కువగా తింటారు. ఇవి సంవత్సరం మొత్తంలో ఏ కాలంలోనైనా దొరకుతుంది.

కడుపును క్లీన్ చేసేస్తుంది..

ముల్లంగి రోజూ తగు మోతాదులో తీసుకోవడం ద్వారా మీ లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మీ కడుపును కడిగేస్తుంది. అనవసరపు గ్యాసెస్ ను అదుపు చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ మెరుగయ్యేలా చేస్తుంది. ఎసిడిటీ, ఒబెసిటీ, గాస్ట్రిక్ సమస్యల భరతం పడుతుంది. అంతేకాక శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్రరక్తకణాలకు అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తుంది. బ్లాక్ ముల్లంగి ఆకులను జాండిస్(కామెర్లు) చికిత్సకు వినియోగిస్తారు.

ఇవి కూడా చదవండి

గుండెను సంరక్షిస్తుంది..

ముల్లంగి గుండెకు రక్షణగా నిలుస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం ద్వారా కార్డియోవాస్కులర్ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాక దీనిలో విటమిన్ సీ, ఫోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.

బీపీ ఇక అదుపులోనే..

ముల్లంగి తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోటాషియం పుష్కలంగా అందుతుంది. తద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది.

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది..

ముల్లంగిలో ఉండే విటమిన్ సీ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. సాధారణంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి వాటిని అరికడుతుంది. అయితే దీనిని రోజూ ఆహారంలో భాగం చేసుకున్నప్పుడే దీని ప్రయోజనాలు పొందగల్గుతాం.

అధిక సంఖ్యలో న్యూట్రియంట్స్..

రెడ్ ముల్లంగిలో అధిక సంఖ్యలో విటమిన్స్ ఈ, ఏ, సీ, బీ6, కే ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పోటాషియం, ఫాస్పరస్, మేగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.

చర్మ ఆరోగ్యానికి..

ముల్లంగి జ్యూస్ రోజూ తీసుకుంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ సీ, జింక్, ఫాస్పరస్ శరీరం డ్రై కాకుండా చేస్తుంది. అలాగే మొటికలు, రాషెస్ రాకుండా నియంత్రిస్తుంది. ముల్లంగి పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. తలకు పట్టిన చుండ్రు కూడా తరిమేస్తుంది.

ఎలా తినాలి..

ముల్లంగి చాలా రకాలుగా ఆరగించవచ్చు.. ఉడకబెట్టి తినొచ్చు. సాలాడ్స్ చేసుకోవచ్చు.. పచ్చడి చేసుకోవచ్చు.. ఈ ముల్లంగి పచ్చడి ఆంధ్రలో ఫేమస్. సూప్స్ చేసుకుని తాగొచ్చు. సాంబార్ వంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు.

మరిన్ని వార్తల కోసం..