Health: ఇమ్యూనిటీ తగ్గిందంటే కరోనా అటాక్..! అందుకే ఎల్లప్పుడు ఈ 4 సుగంధ ద్రవ్యాలు..

Health: గత కొన్ని రోజుల నుంచి కరోనాతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఓ వైపు నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టినా దీని ఉధృతి ఆగడం లేదు.

Health: ఇమ్యూనిటీ తగ్గిందంటే కరోనా అటాక్..! అందుకే ఎల్లప్పుడు ఈ 4 సుగంధ ద్రవ్యాలు..
Health
Follow us

|

Updated on: Oct 31, 2021 | 4:48 PM

Health: గత కొన్ని రోజుల నుంచి కరోనాతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఓ వైపు నుంచి వ్యాక్సిన్ ప్రక్రియ మొదలుపెట్టినా దీని ఉధృతి ఆగడం లేదు. ముఖ్యంగా కరోనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. ఏ మాత్రం అలసత్వంగా ఉన్న అటాక్ చేస్తుంది. అందుకే దీని నుంచి తప్పించుకోవాలంటే ఇమ్యూనిటీని నిత్యం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఖర్చు కూడా పెద్దగా కాదు. ఎందుకంటే ఇంట్లో లభించే సుగంధ ద్రవ్యాలు చాలు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పసుపు పసుపు ఒక బలమైన ఫ్లూ-ఫైటర్. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి కోసం అర టీస్పూన్ పసుపు పొడిని వేడి పాలలో కలిపి తాగవచ్చు.

2. మెంతికూర మెంతికూర వంటలకు అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా ఫైబర్ అద్భుతమైన మూలం. శరీరంలోని కొలెస్ట్రాల్, మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక శక్తికి పెంచడానికి చక్కగా పనిచేస్తుంది.

3. నల్ల మిరియాలు నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. ఇది మొత్తం ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది.

4. మూలికా టీ

బలమైన యాంటీ-ఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన వివిధ మసాలా దినుసులు అనగా తులసి, దాల్చినచెక్క, నల్ల మిరియాలతో తయారు చేసిన మూలికా టీ తాగవచ్చు. రుచి కోసం మీరు బెల్లం లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Health: మీ వయసు 30 దాటిందా..! అయితే కచ్చితంగా ఈ 5 ఆహారాలు అవసరం..