TCS Smart Hiring program: ఫ్రెషర్స్‌కు శుభవార్త..’స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్’ గడువుతేదీని పొడగించిన TCS..

TCS Smart Hiring program: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన 'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్' కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీని పొడిగించినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ

TCS Smart Hiring program: ఫ్రెషర్స్‌కు శుభవార్త..'స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్' గడువుతేదీని పొడగించిన TCS..
Tcs
Follow us

|

Updated on: Oct 31, 2021 | 4:04 PM

TCS Smart Hiring program: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ‘స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్’ కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీని పొడిగించినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ నవంబర్ 2 నుంచి నవంబర్ 30 వరకు పొడిగించింది. దీనికి సంబంధించిన పరీక్షల తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ టీసీఎస్‌ స్మార్ట్ హైరింగ్‌ ప్రోగ్రామ్‌లో టాప్‌ పర్ఫామర్స్‌గా నిలిచిన వారికి టీసీఎస్‌ ఇగ్నైట్‌ ప్రోగ్రామ్‌ (TCS ignite program) ద్వారా ఈసాప్ట్‌వేర్‌ దిగ్గజ సంస్థలోనే ఉద్యోగం పొందే అవకాశం లభిస్తుంది.

అర్హతలు.. సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన అభ్యర్థులందరూ ఈ కోర్సుకు అప్లై చేయవచ్చు. అయితే వాళ్లంతా ఫుల్‌టైమ్‌ కోర్సు పాసై ఉండాలి. బీసీఎ, బీ.ఎస్సీ మ్యాథ్‌, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌, బయోకెమిస్ట్రీ, సీఎస్‌ సబ్జెక్టులు చదివిన గ్రాడ్యుయేట్ల అందరూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2020, 2021లో పాసైనవారు సహ 2022లో పాసయ్యే వారు కూడా ఈ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోవచ్చు.

మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 43,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకున్నామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తెలిపింది. ఇప్పటివరకు ఇదే అత్యధికమని పేర్కొంది. ఈ ఏడాది కనీసం మరో 35,000 మందిని రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని TCS తెలిపింది. పరిశ్రమలోని విస్తృత ధోరణులకు అనుగుణంగా మా అప్రెంటిస్‌ సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతందని తెలిపింది.

Hormone: హార్మోన్ల అసమతుల్యత అనేది ఈ 4 ఆహారాల వల్లే జరుగుతుంది..! ఏంటో తెలుసుకోండి..

PM Kisan: రైతులకు శుభవార్త.. పదో విడతలో రూ.4000 పొందే అవకాశం.. పత్రాల సమర్పణకు ఈ రోజే ఆఖరు తేదీ..

IND vs NZ: ఫైనల్‌ లెవెన్‌‌పై కోహ్లీ సంకేతాలు.. వారు విమర్శకుల నోరు మూయిస్తారా..?

సూపర్బ్‌ కాన్సెప్ట్‌.. విస్తరాకుల్లో పానీపూరీ.. అదుర్స్‌..! వీడియో