AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hormone: హార్మోన్ల అసమతుల్యత అనేది ఈ 4 ఆహారాల వల్లే జరుగుతుంది..! ఏంటో తెలుసుకోండి..

Hormone: ఎండోక్రైన్ గ్రంథుల నుంచి హార్మోన్లు స్రవిస్తాయి. ఇది మీ జీవక్రియను పెంచడం నుంచి పునరుత్పత్తి వరకు ప్రతిదీ నియంత్రిస్తుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత

Hormone: హార్మోన్ల అసమతుల్యత అనేది ఈ 4 ఆహారాల వల్లే జరుగుతుంది..! ఏంటో తెలుసుకోండి..
Hormone Imbalance
uppula Raju
|

Updated on: Oct 31, 2021 | 3:32 PM

Share

Hormone: ఎండోక్రైన్ గ్రంథుల నుంచి హార్మోన్లు స్రవిస్తాయి. ఇది మీ జీవక్రియను పెంచడం నుంచి పునరుత్పత్తి వరకు ప్రతిదీ నియంత్రిస్తుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత అనేది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొన్ని అవయవాల పనితీరు సరిగ్గా ఉండదు. అంతేకాదు చాలా వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల కొన్ని ఆహారాలను అవైడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1.రెడ్ మీట్‌ హార్మోన్ల అసమతుల్యతకు కారణాలలో రెడ్ మీట్‌ ఒకటి. ఎందుకంటే మటన్, పంది మాంసం, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్‌లో హైడ్రోజనేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యకరమైనవి అందుకే వీటికి దూరంగా ఉండాలి. అలాగే రెడ్ మీట్ అధికంగా తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతను మరింత తీవ్రతరం చేస్తుంది.

2. క్రూసిఫరస్ కూరగాయలు అన్ని కూరగాయలు ఆరోగ్యానికి మంచివి కావు. కాలీఫ్లవర్, బ్రోకలీ, కాలే వంటి క్రూసిఫెరస్ కూరగాయలు అధికంగా తీసుకుంటే మంటను కలిగించవచ్చు. అంతేకాకుండా ఈ కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి ప్రభావితం అవుతుంది. ఇది హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది.

3. ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్యాక్ చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం సులభం. కానీ ఇవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఈ ఆహారాలు చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయి. వీటి కలయిక శరీరంలో ఒత్తిడి కలిగిస్తాయి. ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతాయి.

4. కెఫిన్ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నిద్రపై ప్రభావం పడుతుంది. అంతే కాకుండా కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక కార్టిసాల్ స్థాయిలు శరీరంలో ఒత్తిడి పెంచుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు ప్రధాన కారణం.

Gold Island: ఫలించిన ఐదేళ్ల అన్వేషణ.. మత్స్యకారులకు దొరికిన లక్షల కోట్ల విలువజేసే బంగారు ద్వీపం.. ఎక్కడంటే…

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

PM Kisan: రైతులకు శుభవార్త.. పదో విడతలో రూ.4000 పొందే అవకాశం.. పత్రాల సమర్పణకు ఈ రోజే ఆఖరు తేదీ..