Southern Railway Posts: సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Southern Railway Posts: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా..
Southern Railway Posts: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. ఏయో క్రీడాంశాల్లో ఉన్న వారు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* అథ్లెటిక్స్ (మెన్, ఉమెన్), బాస్కెట్‌బాల్ (మెన్, ఉమెన్), క్రికెట్ (ఉమెన్), పవర్‌లిఫ్టింగ్ (మెన్), స్విమ్మింగ్ (మెన్), వాలీబాబ్ (మెన్, ఉమెన్) క్రీడాంశాల్లో అభ్యర్థులను తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2), ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒలింపిక్ గేమ్స్/ వరల్డకప్/ కామన్‌వెల్త్ చాంఫియన్‌షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆట నైపుణ్యాలు, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్‌లో కోచ్ అబ్జర్వేషన్ ఆధారంగా 40 మార్కులు.
* నిబంధనల ప్రకారం సంబంధిత క్రీడల్లో సాధించిన విజయాల ఆధారంగా 50 మార్కులు.
* విద్యార్హతల ఆధారంగా 10 మార్కులు కేటాయిస్తారు.
* అభ్యర్థులు తమ దరఖాస్తులను ది అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, ఆర్‌ఆర్‌సీ, సదరన్ రైల్వే థార్డ్ ఫ్లోర్, నెం 5, చెన్నై 600008 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
samanthas lawyer: సమంత చైతూ తో ఇంకా విడిపోలేదు.. సంచలన విషయాన్ని బయట పెట్టిన లాయర్.. (వీడియో)