T20 World Cup 2021, IND vs NZ: కోహ్లీసేన పేలవ ప్రదర్శన.. కివీస్ బౌలర్ల ధాటికి విలవిల.. న్యూజిలాండ్ టార్గెట్ 111

టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ టీం ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

T20 World Cup 2021, IND vs NZ: కోహ్లీసేన పేలవ ప్రదర్శన.. కివీస్ బౌలర్ల ధాటికి విలవిల.. న్యూజిలాండ్ టార్గెట్ 111
NZ vs AFG
Follow us
Venkata Chari

|

Updated on: Oct 31, 2021 | 9:14 PM

T20 World Cup 2021, IND vs NZ: టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టీంల మధ్య జరుగుతోన్న మ్యాచులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ టీం ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

టీమిండియా కీలక మ్యాచులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను పంపించింది. అయితే ఈ మార్పు పెద్దగా ఫలించలేదు. ఇషాన్ కిషన్ (4) ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి, పేలవ ఆటతీరును కనబరిచింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన సమయంలో రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో టోర్నీలో ఆడుతోన్న రెండో మ్యాచులో కూడా టీమిండియా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తోంది. ఆ వెంటనే కోహ్లీ (9 పరుగులు) కూడా ఓ రాంగ్ షాట్ ఆడే క్రమంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ 8, పాండ్యా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

టీమిండియా వరుస వికెట్లు కోల్పోయి, రన్‌రేట్ తక్కువలో ఉండటంతో.. బ్యాటర్లు భారీ షాట్స్‌కు యత్నించి పెవిలియన్ చేరుతున్నారు. ఈ క్రమంలోనే పంత్(12) ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి మిల్నే బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం హార్దిక్ పాండ్యా (23 పరుగులు, 24 బంతులు, 1ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో లేకుండానే పెవిలయన్ చేరాడు. అనంతరం ఇదే ఓవర్‌లో శార్దుల్ (0) కూడా పెవిలియన్ చేరాడు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 3, సోథీ 2 వికెట్లు, సౌథీ, ఆడం మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.

Also Read: T20 World Cup 2021, IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన..!

T20 World Cup 2021: 131 పరుగులు.. 11 వికెట్లు.. ఆల్ రౌండ్ ఆటతో ఆకట్టుకున్న ఆటగాడు.. గాయంతో టోర్నీ నుంచి ఔట్