AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021, IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన..!

కీలక మ్యాచులో భారత్ మరోసారి తడబడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ టోర్నీలో తన రెండో మ్యాచులోనూ పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

T20 World Cup 2021, IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయిన కోహ్లీసేన..!
Venkata Chari
|

Updated on: Oct 31, 2021 | 8:41 PM

Share

T20 World Cup 2021, IND vs NZ: కీలక మ్యాచులో భారత్ మరోసారి తడబడుతోంది. వరుసగా వికెట్లు కోల్పోతూ టోర్నీలో తన రెండో మ్యాచులోనూ పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

టీమిండియా కీలక మ్యాచులో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లను పంపించింది. అయితే ఈ మార్పు పెద్దగా ఫలించలేదు. ఇషాన్ కిషన్ (4) ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి, పేలవ ఆటతీరును కనబరిచింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన సమయంలో రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. దీంతో టోర్నీలో ఆడుతోన్న రెండో మ్యాచులో కూడా టీమిండియా పేలవ ఆటతీరుతో నిరాశపరుస్తోంది.

ఆ వెంటనే కోహ్లీ (9 పరుగులు) కూడా ఓ రాంగ్ షాట్ ఆడే క్రమంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పంత్ 8, పాండ్యా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇక న్యూజిలాండ్ బౌలర్లలో సోథీ 2 వికెట్లు, బౌల్ట్, సౌథీ చెరో వికెట్ పడగొట్టారు.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్