samanthas lawyer: సమంత చైతూ తో ఇంకా విడిపోలేదు.. సంచలన విషయాన్ని బయట పెట్టిన లాయర్.. (వీడియో)
సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం అనంతరం పలు యూట్యూబ్ ఛానెళ్లు ఆమె ప్రతిష్టతను దెబ్బ తీసేలా కొన్ని కథనాలు చేశారంటూ నటి సమంత కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25న సమంత తరఫు న్యాయవాది...
సమంత, నాగచైతన్య విడాకుల వ్యవహారం అనంతరం పలు యూట్యూబ్ ఛానెళ్లు ఆమె ప్రతిష్టతను దెబ్బ తీసేలా కొన్ని కథనాలు చేశారంటూ నటి సమంత కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 25న సమంత తరఫు న్యాయవాది బాలాజీ కూకట్ పల్లి కోర్టు లో వాదనలు వినిపించారు. సమంత, నాగచైతన్యకు విడాకులు ఇంకా మంజూరు కాకముందే సమంత పై వ్యక్తిగతంగా అనైతికంగా ఆరోపణలు చేయడం సబబు కాదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సమంత గౌరవాన్ని దెబ్బతీసేలా యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై చర్యలు తీసుకోవాలని సమంత తరుపు న్యాయవాది కోర్టును అభ్యర్థించాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయడం సరైందని కాదని వాదించారు. ఇక కోర్టులో వాదనలు వినిపించిన తరువాత బయటికి వచ్చిన సమంత లాయర్ మీడియాతో మాట్లాడారు. తమ పిటిషన్లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదని తేల్చి చెప్పారు. కేవలం వీడియోలకు సంబంధించిన లింకులను మాత్రమే తొలగించాలని కోరామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు ఇక భవిష్యత్తులో ఇలాంటి వార్తలు మరోసారి ప్రసారం చేయకుండా.. పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

