Vaccine In China: చైనాలో మూడేళ్ల చిన్నారులకు కరోనా టీకా.. మళ్ళీ కేసులు పెరగడంతో సర్కార్ నిర్ణయం..(వీడియో)
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చైనా తర్వాత 100 కోట్ల డోసుల మార్కును దాటిన రెండోదేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చైనా తర్వాత 100 కోట్ల డోసుల మార్కును దాటిన రెండోదేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో చైనా మరో ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా మూడొంతుల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం.. కనీసం అయిదు ప్రావిన్సుల్లో 3 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూస్తుండటంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్ ప్రావిన్స్‌ల యంత్రాంగాలు త్వరలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాయి. ఇందుకోసం దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ వ్యాక్సిన్లను చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్లున్న చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్ టీకాలను పంపిణీ చేసింది. ఈ రెండు టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ విషయంలో స్పష్టత రాలేదు. కానీ చైనా మాత్రం డెల్టా వేరియంట్ నుంచి కూడా సినోఫాం, సినోవాక్ రక్షణ కల్పిస్తున్నాయని చెబుతోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

