Kitchen Hacks: ఈ టిప్స్‌తో ఇంట్లోంచి బొద్దింకలు పారిపోవడం పక్కా..
వంటగదిలో మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో బొద్దింకలు కూడా ఒకటి. ఉదయం పెద్దగా ఏమీ కనిపించకపోయినా.. రాత్రి అయ్యే సరికి దండయాత్ర మొదలు పెడతాయి. కిచెన్‌లోని అన్ని వస్తువులపై, సామన్లపై పాకుతూ ఉంటాయి. ఈ బొద్దింకల వల్ల ఎక్కువగా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత..

వంటగదిలో మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో బొద్దింకలు కూడా ఒకటి. ఉదయం పెద్దగా ఏమీ కనిపించకపోయినా.. రాత్రి అయ్యే సరికి దండయాత్ర మొదలు పెడతాయి. కిచెన్‌లోని అన్ని వస్తువులపై, సామన్లపై పాకుతూ ఉంటాయి. ఈ బొద్దింకల వల్ల ఎక్కువగా బ్యాక్టీరియా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మరింత జాగ్రత్త అవసరం. వీటి బెడద వదిలించుకోవడానికి చాలా మంది మార్కెట్ నుంచి స్ప్రేలు తీసుకొచ్చి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల కూడా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా కొన్నినేచురల్ టిప్స్‌తో బొద్దింకల బెడద తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో లేట్ లేకుండా చూసేయండి.
బొద్దింకలను వదిలించుకునేందుకు చిట్కాలు:
* బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట బిర్యానీ ఆకుల పొడిని వేసి చల్లండి. బిర్యానీ ఆకుల ఘాటు పొడి వల్ల.. మూలల్లో ఉండే బొద్దింకలు తగ్గుతాయి.
* బొద్దింకలు ఉండే చోట లెమన్ గ్రాస్ ఆయిల్ లేదా పెప్పర్ మెంట్ ఆయిల్, పుదీనా ఆయిల్ వంటి ఘాటు వాసన ఆయిల్స్ రెండు లేదా మూడు చుక్కల్ని వేయండి. ఇలా చేయడం వల్ల కూడా బొద్దింకల బెడద తగ్గుతుంది.
* బొద్దింకలను వదిలించుకునేందుకు బేకింగ్ సోడా కూడా హెల్ప్ చేస్తుంది. బేకింగ్ సోడా, చక్కెర కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి. దీంతో అవి చనిపోతాయి.
* క్యారెమ్స్ ఆడుకోవడానికి ఉపయోగించే బోరిక్ పౌడర్‌తో కూడా బొద్దింకలను తగ్గించుకోవచ్చు. బొద్దింకలు తిరిగే చోట ఈ పౌడర్‌ను చల్లితే.. వీటి బెడద తగ్గుతుంది.
* బొద్దింకలు ఉన్న ప్రదేశంలో లవంగాలను, దాల్చిన చెక్క ఇలాంటి ఘాటు వాసన వచ్చే మసాలా దినుసులు ఉంచడం వల్ల కూడా బొద్దింకలు అటువైపు రావు.
* అదే విధంగా వేప ఆకుల్ని తీసుకొచ్చి.. మిక్సీలో వేసి పేస్టులా చేయండి. వీటితో బాల్స్‌ని తయారు చేసి బొద్దింకలు తిరిగే చోట ఉంచితే.. ఈ వాసనకు బొద్దింకలు ఇంట్లోకి రావు. వేపాకుల నుంచి రసం తీసి.. చల్లినా మంచి ఫలితం ఉంటుంది.
* బొద్దింకల్ని తరిమికొట్టడానికి.. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఉండే చోట పెడితే.. అవి పారిపోతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








