Monsoon Beauty Tips: వర్షంలో తడుస్తున్నారా ? అయితే ఈ చిన్న చిన్న చర్మ జాగ్రత్తలు ఫాలో అవ్వాలట.. నిపుణుల సలహాలు..

కాలం మారుతున్న కొద్ది అనారోగ్య సమస్యలతోపాటు.. చర్మ సమస్యలు కూడా మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. ముఖ్యంగా సీజన్‏ను బట్టి రకారకాల చర్మ సమస్యలు వేధిస్తాయి.

Monsoon Beauty Tips: వర్షంలో తడుస్తున్నారా ? అయితే ఈ చిన్న చిన్న చర్మ జాగ్రత్తలు ఫాలో అవ్వాలట.. నిపుణుల సలహాలు..
Monsoon Healthy Tips
Follow us

|

Updated on: Jul 06, 2021 | 1:58 PM

కాలం మారుతున్న కొద్ది అనారోగ్య సమస్యలతోపాటు.. చర్మ సమస్యలు కూడా మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. ముఖ్యంగా సీజన్‏ను బట్టి రకారకాల చర్మ సమస్యలు వేధిస్తాయి. ఇక వర్షాకాలంలో చర్మం పొడిగా ఉండి.. దురద సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మాన్ని సంరక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవెంటో తెలుసుకుందామా.

✿ రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రోజ్ వాటర్, కలబంద లేదా యాపిల్ సిడార్ వెనిగర్‏ను మృదువుగా అప్లై చేయాలి. ✿ చర్మంపై టోనింగ్ చేయడానికి పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్ టీ ఏదోకటి రాస్తూ ఉండాలి. మృత కణాల బెడద కూడా తగ్గుతుంది. ✿ టాక్సిన్లను బయటకు పంపడానికి ఎక్కువగా మంచినీటిని తాగుతూ ఉండాలి. దీనివలన మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే మేకప్‏ను తొలగించి శుభ్రం చేసుకోవాలి. ✿ వారానికొకసారైనా ఒంటికి కొబ్బరి నూనె రాసి పెసర లేదా సెనగ పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అలాగే రోజూ అరచెక్క నిమ్మరసాన్ని పిండిన గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ✿ వర్షాకాలంలో మేకప్ ఎక్కువగా వేసుకోకపోవడమే మంచిది. అయితే వాటర్ ఫ్రూవ్ మేకప్ వాడితో చర్మానికి ఎలాంటి సమస్యలు ఉండవు. ✿ చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. రెగ్యులర్‏గా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తూ ఉండాలి. ✿ వర్షాకాలంలో షూస్, సాక్స్ ధరించడం చాలా ప్రమాదం. ఎందుకంటే వీటి వలన ఇన్ఫెక్షన్ల భారిన పడే ప్రమాదముంది. ✿ వర్షాకాలంలో నీటి కాలుష్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో ఎక్కువగా కాచి చల్లార్చిన నీటిని తాగుతూ ఉండాలి. ✿ బయటి నుంచి వచ్చిన వెంటనే గోరు వెచ్చని నీటిలో కాళ్లను కాసేపు ఉండనివ్వాలి.

Also Read: TS High Coourt: కొనసాగుతున్న కృష్ణానది జల విద్యుదుత్పత్తి వివాదం.. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు

Road Accident: సఖినేటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. అంతర్వేది రథం దగ్ధం కేసులో అనుమానితుడు మృతి..!

Rats Drunk: ఎలుకలా మజకా..! 12 బాటిళ్ల ముందు లాగించేసిన మూషికాలు.. నోరెళ్లబెట్టిన ఎక్సైజ్ అధికారులు