Road Accident: సఖినేటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. అంతర్వేది రథం దగ్ధం కేసులో అనుమానితుడు మృతి..!
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు.
Sakhinetipalli Road Accident: తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మణం పాలయ్యాడు. అంతర్వేది ఆలయంలోని రథం దగ్ధం ఘటనలో అనుమానితుడుగా పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
రాత్రి వేళ అటూ ఇటూ తచ్చాడిన ఆ వ్యక్తి.. ఓ షాప్ ముందర ఉన్న ప్లాసిక్ కవర్‌ను కప్పుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున ఓ మినీ వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న కవర్లపై నుంచి దూసుకెళ్లింది. అందులో పడుకుని ఉన్న అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి.
తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ ఆలయం అంతర్వేది రథం దగ్ధం ఘటనలో అనుమానితుడని పోలీసులు తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నారు. Read Also.. Revanth Reddy : రేపే పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.. భారీ సభకు ప్లాన్.. లక్ష మంది వస్తారని అంచనా..