Liquor Mafia: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి పోటెత్తుతోన్న మద్యం.. 1700 సీసాల అక్రమ మద్యం పట్టివేత.

Liquor Mafia: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి పోటెత్తుతోన్న మద్యం.. 1700 సీసాల అక్రమ మద్యం పట్టివేత.
Liquor Mafia

Liquor Mafia In Vishaka: ఆంధ్రప్రదేశ్‌లో మద్య విధానం మార్పు తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఇటీవల పట్టుబడుతోన్న మద్యం సీసాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు..

Narender Vaitla

|

Jul 06, 2021 | 3:19 PM

Liquor Mafia In Vishaka: ఆంధ్రప్రదేశ్‌లో మద్య విధానం మార్పు తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దుల్లో ఇటీవల పట్టుబడుతోన్న మద్యం సీసాలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా సాగర నగరం విశాఖలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. కొందరు దుండగులు ఒడిశా నుంచి అక్రమంగా మద్యాన్ని ఎంచక్కా నగరంలోకి డంప్‌ చేస్తున్నారు. ఇలా దిగుమతి అయిన మద్యాన్ని అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. విశాఖ రెడ్నం గార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన మత్తల గిరి.. ఒడిశాకు చెందిన సంతోష్‌ కుమార్‌ పండా, సదాశివ పాత్ర అనే వ్యక్తులతో చేతులు కలిపి ఓ వాహనాన్ని మాట్లాడుకున్నాడు. అనంతరం ఒడిశా నుంచి భారీగా మద్యాన్ని విశాఖకు దిగుమతి చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం ఈ కేటుగాళ్లు తవుడు సంచులను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ బ్యాగుల్లో రకరకాల బ్రాండ్‌లకు చెందిన మద్యం బాటిళ్లను దర్జాగా నగరంలోకి డంప్‌ చేస్తున్నారు. ఇలా విశాఖలోకి వచ్చిన మద్యాన్ని నగరానికి చెందిన మొగిలి అజయ్‌, కిరన్‌ సాగర్‌, తిరుపతిల సహకారంతో అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ అక్రమ దందా బయటపడింది. తవుడు బస్తాల మాటున తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. ఏకంగా 1702 మద్యం సీసాలను సీజ్‌ చేశారు. ఈ అక్రమ మద్యం దందాపై పోలీసులు మరింత లోతుగా విచారణ మొదలు పెట్టారు.

Liquor Mafia In Vishaka

Liquor Mafia In Vishaka

Also Read: Road Accident: సఖినేటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. అంతర్వేది రథం దగ్ధం కేసులో అనుమానితుడు మృతి..!

Ramky Group: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి.. సంస్థలు, ఇంట్లో ఐటీ సోదాలు.. 15 చోట్ల..

Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బరితెగిస్తున్న సాండ్ మాఫియా.. పట్టించుకోని అధికారులు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu