AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rats Drunk: ఎలుకలా మజకా..! 12 బాటిళ్ల ముందు లాగించేసిన మూషికాలు.. నోరెళ్లబెట్టిన ఎక్సైజ్ అధికారులు

Rats Drunk Wine Bottles: ఇంట్లోకి ఎలుకలు ప్రవేశిస్తే వాటి గోల ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన పనిలేదు. ఏ వస్తువు ఉన్నా కొరుకుతాయి. అంతేకాకుండా ఆహార పదార్థాలన్నింటినీ తెగ ఆగం చేస్తుంటాయి. అయితే..

Rats Drunk: ఎలుకలా మజకా..! 12 బాటిళ్ల ముందు లాగించేసిన మూషికాలు.. నోరెళ్లబెట్టిన ఎక్సైజ్ అధికారులు
Rats Drunk
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2021 | 1:40 PM

Share

Rats Drunk Wine Bottles: ఇంట్లోకి ఎలుకలు ప్రవేశిస్తే వాటి గోల ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన పనిలేదు. ఏ వస్తువు ఉన్నా కొరుకుతాయి. అంతేకాకుండా ఆహార పదార్థాలన్నింటినీ తెగ ఆగం చేస్తుంటాయి. అయితే.. అలాంటి ఎలుకలు.. ఓ వైన్‌ షాప్‌లో 12 వైన్ బాటిళ్ల మద్యాన్ని హాంఫట్ చేశాయి. మీరు వింటున్నది నిజమే.. ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగి వార్తల్లో నిలిచాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని కరోనా లాక్‌డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. దీంతో మద్యం షాపులను ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్‌ షాప్‌ తెరిచి లోపలికి వెళ్లిన సిబ్బంది ఆశ్చర్యపోయారు. లోపల 12 ఖాళీ వైన్ బాటిళ్లు దర్శనమివ్వడంతో.. తమిళనాడు ఎక్సైజ్ అధికారులకు సమచారమిచ్చారు. అయితే.. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ మొత్తం ఖాళీ అయ్యిందని అధికారులు తెలిపారు. అయితే.. ఆ వైన్‌ను ఎలుకలే తాగి ఉంటాయని పేర్కొంటున్నారు.

దీనిపై ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ.. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు గుర్తించామన్నారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు పెరిగిపోయాయని.. బాటిళ్ల మూతలను కొరికి వాటిలో ఉన్న మద్యాన్ని తాగేశాయని తెలిపారు. ఎలుకలు ఖాళీ చేసిన వైన్‌ విలువ రూ.1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదని తెలిపారు.

అయితే.. ఈ విషయం కాస్త.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… నెటిజన్లు, మందుబాబులు తెగ నవ్వుకుంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఎలుకలు మందు తాగుతున్నాయని.. వాటికి ఏమాత్రం కిక్కు ఏక్కిందో అంటూ సరదా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

Also Read:

Fish Pond: చేపలందు ఈ చెరువులోని చేపలే వేరు.. తండోపతండాలుగా తరలివస్తున్న జనాలు.. అసలు విషయం ఏంటంటే..

Marriage Gift: ఆ తండ్రి ఐడియానే వేరు.. కుమార్తె పెళ్లికి కట్నంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు.. ఎందుకంటే..?