Rasagulla Recipe: స్వీట్స్ షాప్ లో దొరికే విధంగా.. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పన్నీర్ తో రసగుల్లా తయారీ ..
Rasagulla Recipe: ఒకోసారి అనుకోకుండా పాలు విరిగిపోతాయి. అప్పుడు ఆ పాలవిరుగుడు పనీర్ చేస్తారు.. దానిని వంటల్లో ఉపయోగిస్తే.. మరికొందరు స్వీట్స్ కూడా తయారు చేస్తారు...
Rasagulla Recipe: ఒకోసారి అనుకోకుండా పాలు విరిగిపోతాయి. అప్పుడు ఆ పాలవిరుగుడు పనీర్ చేస్తారు.. దానిని వంటల్లో ఉపయోగిస్తే.. మరికొందరు స్వీట్స్ కూడా తయారు చేస్తారు.. కానీ నిజానికి అలా విరిపోయిన పాల పన్నీర్ కంటే.. మంచి పాలను తీసుకుని మనమే ప్రత్యేక పద్ధతిలో విరగొట్టి.. పన్నీర్ తయారు చేసుకుని వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు స్వీట్స్ షాప్ లో దొరికే రసగుల్లా ను అంతే టేస్టీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలతో తెలుసుకుందాం..
కావలిసిన పదార్ధాలు :
పచ్చిపాలు – అరలీటరు మిల్క్ పౌడరు – అరకప్పు నీళ్లు – .రెండు కప్పులు వెనిగర్ లేదా నిమ్మరసం కొంచెం యాలకుల పొడి కుంకుమ పువ్వు రోజ్ వాటర్ నెయ్యి
తయారీ విధానం:
స్టౌ మీద ఓ గిన్నె పెట్టి.. దానిలో పచ్చిపాలు, మిల్క్ పౌడరు..రెండు కప్పుల నీళ్లు.. వేసి కలపాలి. అవి కాగుతున్న సమయంలో కొంచెం నిమ్మరసం లేదా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేయాలి. అప్పుడు పాలు విరిగిపోతాయి. అప్పుడు ఆ పాలను తీసుకుని ఒక బట్టలో వేసి వడకట్టాలి. గట్టిగా పిండి దానిమీద బరువు పెట్టాలి. పావుగంట తర్వాత.. ఆ విరుగుని తీసుకుని మిక్సీ లో వేయాలి.
అది స్మూత్ గా అవుతుంది. దానిని బాగా కలిపి స్మూత్ గా వచ్చే వరకూ మర్దనా చేసి ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేయాలి. ఈ లోగా పంచదార.. ఒక కప్పు.. అయిదు కప్పుల నీళ్లు పోసి.. మరిగించాలి.. అది ఉడుకుతున్నపుడు.. ఈ పాకంలో ఈ ఉండలు వేసి.. పదిహేను నిమిషాల పాటు సిమ్ లోనే ఉడికించాలి.. పాకంలో యాలకుల పొడి కానీ.. కుంకుమ పువ్వు కానీ.. రోజ్ వాటర్ కానీ వేసుకోవచ్చును. ఇష్టమైన వారు డ్రైప్రూట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన రసగుల్లా రెడీ.
Also Read: వనజీవి రామయ్య ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు