Beauty Tips: అందమైన పాదాల కోసం ఐదు పద్దతులు.. పార్లర్ అవసరమే లేదు..?
Beauty Tips: అందమైన ముఖం ఉంటే సరిపోదు. అందంగా కనిపించాలంటే శరీరంలోని ప్రతి భాగం అందంగా ఉండాలి. మీ ముఖం అందంగా
Beauty Tips: అందమైన ముఖం ఉంటే సరిపోదు. అందంగా కనిపించాలంటే శరీరంలోని ప్రతి భాగం అందంగా ఉండాలి. మీ ముఖం అందంగా కనిపించినా చేతులు, కాళ్లు నల్లగా ఉంటే అగ్లీగా ఉంటారు. కాబట్టి చర్మంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. దీని కోసం మీరు పార్లర్‌ను సందర్శించి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అందమైన పాదాల కోసం 5 పద్దతులను అనుసరిస్తే సరిపోతుంది.
పెడిక్యూర్ చేయడానికి ముందుగా మీ పాదాల గోళ్లను కత్తిరించండి. నెయిల్ ఫైలర్‌తో కావలసిన ఆకృతిని ఇవ్వండి. ఇప్పుడు ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని పోసి షాంపూ, నిమ్మరసం వేసి గులాబీ లేదా బంతి పువ్వులను వేయండి. అందులో మీ పాదాలను 10-15 నిమిషాలు ఉంచండి. పాదాల చర్మం మృదువుగా మారినప్పుడు స్క్రబ్ బ్రష్‌తో రుద్దడం ప్రారంభించండి. డెడ్ స్కిన్ మొత్తం తొలగించండి.
నిమ్మకాయ ముక్కలను తీసుకొని పాదాలకి రుద్దండి. తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడగండి. ఇప్పుడు తేనెలో కొంత మాయిశ్చరైజింగ్ క్రీమ్ మిక్స్ చేసి, రెండింటినీ బాగా మిక్స్ చేసి పాదాలను స్క్రబ్ చేయండి. తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది. చివరగా పాదాలను శుభ్రమైన టవల్‌తో తుడవండి. తర్వాత పాదాలకు క్రీమ్ రాసి సాక్స్ ధరించండి. ఎప్పటికప్పుడు పెడిక్యూర్ చేయడం వల్ల పాదాల చర్మం మృదువుగా ఉండి అందంగా కనిపిస్తాయి.