- Telugu News Photo Gallery Viral photos Super computer discovered 100000 new viruses including nine new coronaviruses
Viral Photos: సూపర్ కంప్యూటర్ ద్వారా 9 కొత్త వైరస్‌లని కనుగొన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు
Viral Photos: సూపర్ కంప్యూటర్లు శాంపిల్స్ ద్వారా లక్షకు పైగా వైరస్‌లను కనుగొన్నాయి. వాటిలో 9 కొత్త కరోనా వైరస్‌లు కూడా ఉన్నాయి.
Updated on: Feb 02, 2022 | 11:56 PM

సూపర్ కంప్యూటర్లు శాంపిల్స్ ద్వారా లక్షకు పైగా వైరస్‌లను కనుగొన్నాయి. వాటిలో 9 కొత్త కరోనా వైరస్‌లు కూడా ఉన్నాయి. ఇవి మునుపెన్నడూ చూడని కరోనా వైరస్ రూపాలు.

పరిశోధన నివేదిక ప్రకారం.. బయోలాజికల్ శాంపిల్స్ ద్వారా సూపర్ కంప్యూటర్లు మొత్తం 1.32 లక్షల ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లను కనుగొన్నాయని నివేదిక పేర్కొంది.

సూపర్ కంప్యూటర్ అన్ని నమూనాలను పరిశీలించింది. ఈ సమయంలో 9 కొత్త కరోనావైరస్లు కనుగొన్నారు. వాటి గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆవిష్కరణ సహాయంతో వ్యాధులు అంటువ్యాధులను గుర్తిస్తారు.

జన్యుపరంగా చాలా భిన్నమైన వైరస్‌ల ప్రపంచంలోకి మనం వెళ్తున్నామని ఆర్టెమ్ బాబైన్ అనే పరిశోధకుడు చెప్పారు. జంతువులు అనేక రకాల వైరస్‌లను కలిగి ఉన్నాయని ఇప్పటివరకు వెల్లడైన సమాచారం రుజువు చేస్తుంది.

ఇప్పుడు వైరస్‌ను గుర్తించడం అది ఎక్కడ వ్యాపించిందనే దాని సమాచారం చెప్పడం చాలా సులభం అవుతుంది. ఈ కంప్యూటర్ల వల్ల వ్యాధులకు చికిత్సను కనుక్కోవడం సులువవుతుంది.



