Skoda Slavia: ఫిబ్రవరి 10న షోరూమ్‌లలోకి రానున్న స్కోడా స్లావియా.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Skoda Slavia: స్కోడా ఆటో ఇండియాకు చెందిన ప్రముఖ కారు స్కోడా స్లావియా ఫిబ్రవరి 10న షోరూమ్‌లోకి వస్తుందని కంపెనీ సేల్స్, సర్వీస్ మార్కెటింగ్
Skoda Slavia: స్కోడా ఆటో ఇండియాకు చెందిన ప్రముఖ కారు స్కోడా స్లావియా ఫిబ్రవరి 10న షోరూమ్‌లోకి వస్తుందని కంపెనీ సేల్స్, సర్వీస్ మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ వెల్లడించారు. అయితే టెస్ట్ డ్రైవ్ అనేది ప్రెస్ డ్రైవ్ ముగిసిన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. స్లావియా లాంచ్, ధర మార్చి మొదటి వారంలో వెల్లడవుతుంది. ఈ సమయంలో కస్టమర్లకు కారు డెలివరీ కూడా ప్రారంభమవుతుంది. కొత్త మిడ్-సైజ్ సెడాన్ స్కోడా ఇండియా 2.0 వ్యూహం కింద రెండో ఉత్పత్తి. మొదటి ఉత్పత్తి కుషాక్ మిడ్-సైజ్ SUV. ఇది భారతీయ మార్కెట్‌లో మంచి పేరు సంపాదించింది.
కారులో రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉంటాయి. మూడు-సిలిండర్ యూనిట్‌తో 1.0-లీటర్, నాలుగు-సిలిండర్ యూనిట్‌తో 1.5-లీటర్. 1.0 TSI గరిష్టంగా 115 PS శక్తిని, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేస్తారు. ఈ ఇంజన్ అన్ని వేరియంట్‌లతో అందిస్తారు. చాలా మంది ప్రజలు ఈ ఇంజిన్‌ని ఇష్టపడతారు ఎందుకంటే నగర వినియోగానికి ఇది బాగా సూటవుతుంది.
1.5 TSI ఇంజన్ గరిష్టంగా 150 PS శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ DSG డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. స్లావియా 179 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ 521 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుందని అంచనా. స్లావియా స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వెనుక AC వెంట్‌లు, కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరిన్నింటి కోసం పుష్-బటన్‌లతో వస్తుంది. స్కోడా స్లావియా మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా రాబోయే ఫోక్స్‌వ్యాగన్ వెర్టాలతో పోటీపడుతుంది.