AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: దేవుని సేవ పేరుతో డబ్బుల వసూళ్లు.. లైంగిక వేధింపులు.. విశాఖలో నకిలీ పాస్టర్ లీలలు..

Fake pastor arrested: ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో నకిలీ పాస్టర్ వ్యవహారం బట్టబయలైంది. తెలంగాణకు చెందిన యువతి ఫిర్యాదుతో పాస్టర్

AP Crime News: దేవుని సేవ పేరుతో డబ్బుల వసూళ్లు.. లైంగిక వేధింపులు.. విశాఖలో నకిలీ పాస్టర్ లీలలు..
Fake Paster
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2022 | 2:07 PM

Share

Fake pastor arrested: ఏపీలోని విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో నకిలీ పాస్టర్ వ్యవహారం బట్టబయలైంది. తెలంగాణకు చెందిన యువతి ఫిర్యాదుతో పాస్టర్ లైంగిక వేధింపులు, రూ.కోట్ల డబ్బు వసూళ్ల బాగోతం కూడా వెలుగులోకి వచ్చింది. దేవుని సేవ పేరుతో డబ్బులను వసూళ్లు చేసి పాయకరరావుపేట శ్రీరాంపూరంలో రూ.2 కోట్లతో భవనం నిర్మించినట్లు పేర్కొంటున్నారు. విజయవాడకు చెందిన పాస్టర్ (Fake Pastor) అనిల్ కుమార్ అలియాస్ ప్రేమ దాసు ప్రేమ స్వరుపి యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసి డబ్బుల వసూళ్ల దందాకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన కింద 30 మంది మహిళలను దేవుని సేవ పేరుతో నగదు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ యువతిని లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాధితులు చాలామంది ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అనంతరం ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆదేశాలతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు పాస్టర్ అనిల్ అలియాస్ ప్రేమ దాసును అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

పాస్టర్ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ పేరుతో, సమావేశాల పేరుతో రూ.కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పాస్టర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పాయకరావు పేట పోలీసులు తెలిపారు. పాస్టర్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read:

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన కిరాతకుడు..

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీ క్షేమం కోరుతూ పాతబస్తీలో ప్రత్యేక ప్రార్థనలు.. వీడియో

Andhra Pradesh: ఆ భయంతోనే మిమ్మల్నీ కలవలేకపోతున్నా.. ముఖ్యమంత్రి జగన్‌కు ముద్రగద లేఖ..