Tree Species: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జాతుల చెట్టు ఉన్నాయో తెలుసా..? పరిశోధనలలో ఆశ్చర్యపోయే నిజాలు..!

Tree Species: ప్రపంచంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో శాస్త్రవేత్తల వద్ద ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. దీన్ని తెలుసుకోవడానికి,..

Tree Species: ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని జాతుల చెట్టు ఉన్నాయో తెలుసా..? పరిశోధనలలో ఆశ్చర్యపోయే నిజాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2022 | 11:17 AM

Tree Species: ప్రపంచంలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో శాస్త్రవేత్తల వద్ద ఇప్పటికీ ఖచ్చితమైన సమాధానం లేదు. దీన్ని తెలుసుకోవడానికి, ప్రపంచంలోని 100 మందికి పైగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. భూమిపై దాదాపు 73 వేల రకాల చెట్లు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. ఇంకో విషయం ఏమిటంటే, వీటిలో 9,200 జాతులు ఇంకా కనిపెట్టలేదు. అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి.

శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. ప్రస్తుతం చెట్ల సంఖ్య మానవ ఆలోచనతో పోలిస్తే 14 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా అరుదుగా ఉండే ఇలాంటి చెట్ల జాతులు అనేకం ఉండడానికి ఇదే కారణం. పరిశోధన ఫలితాలు అటవీ సంరక్షణకు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణంగా అంతరించిపోతున్న అడవుల్లో ఇలాంటి అరుదైన వృక్షాలు చాలా ఉండడం కూడా పెద్ద సమస్యే అంటున్నారు పరిశోధకులు. అడవులు, చెట్లు, వాటి ఉత్పత్తుల గురించి కొత్త సమాచారాన్ని కనుగొనడం కూడా పరిశోధన చేయడానికి ఒక కారణం.

ప్రపంచంలో 9,200 అరుదైన జాతుల చెట్లు ఉన్నాయని అంతర్జాతీయ పరిశోధకుల బృందానికి తెలుసు. అయితే, ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి, వాతావరణ మార్పులతో పోరాడడం ద్వారా మానవులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఏ చెట్లు పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు శాస్త్రవేత్తలు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికీ 40 శాతం చెట్ల జాతులు ఉన్నాయి. ఇవి దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తాయి. చాలా అరుదైన చెట్ల జాతులను ఇక్కడ చూడవచ్చు. ప్రతి చెట్టును నేల స్థాయిలో కొలిచే నిపుణుల సహాయంతో ఈ గణాంకాలు నివేదించబడ్డాయని యూఎస్‌ (US) లోని ఇండియానాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం సమన్వయకర్త జింగ్జింగ్ లియాంగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Jio Phone 5G: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తక్కువ ధరలో జియో 5G ఫోన్‌.. స్పెసిఫికేషన్ల వివరాలు లీక్‌..

EVM Machine: ఈవీఎంల ద్వారా ఓటింగ్‌ రిగ్గింగ్‌ జరుగుతుందా..? మెషీన్‌లో ఉండే మైక్రోచిప్‌ ప్రత్యేకత ఏమిటి..?

Safety Pin: సేఫ్టీ పిన్‌ భద్రత కోసం తయారు చేయబడిందా..? దీనిని ఎవరు కనిపెట్టారు..?