Mark Zuckerberg: ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చడం కలిసిరావడం లేదా? మార్క్ జూకర్‌బెర్గ్ సంపద కరిగిపోతోంది

Mark Zuckerberg: ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చడం కలిసిరావడం లేదు.. మార్క్ జూకర్‌బెర్గ్ సంపద కరిగిపోతోంది. అమెరికాలో..

Mark Zuckerberg: ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చడం కలిసిరావడం లేదా? మార్క్ జూకర్‌బెర్గ్ సంపద కరిగిపోతోంది
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2022 | 1:45 PM

Mark Zuckerberg: ఫేస్‌బుక్ పేరును మెటాగా మార్చడం కలిసిరావడం లేదు.. మార్క్ జూకర్‌బెర్గ్ సంపద కరిగిపోతోంది. అమెరికాలో గురువారం మార్కెట్‌ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు 25 శాతం కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్‌ చరిత్రలో ఎన్నడూలేనంతస్థాయిలో కంపెనీ మార్కెట్‌ విలువ నిమిషాల్లో హరించుకుపోయింది. ఇంటర్నెట్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ స్టాక్‌ మార్కెట్లో విధ్వంసం సృష్టించింది. గురువారం మార్కెట్‌ ప్రారంభ క్షణాల్లోనే ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ షేర్లు 26 శాతం కుప్పకూలాయి. జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా తన నికర విలువలో 23.34 శాతం కోల్పోయాడు. $87.7 బిలియన్ల వద్ద, అతను ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 12వ స్థానానికి పడిపోయాడు

.ఇది ఇప్పటివరకు స్టాక్ చరిత్రలో అతిపెద్ద డ్రాప్. మెటా అంచనాల నుండి బలహీన ఫలితాల కారణంగా స్టాక్‌లో పతనం కనిపించింది. స్టాక్‌లో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ పతనం కారణంగా కంపెనీ వాల్యుయేషన్ ఒక్కరోజులో $200 బిలియన్లు పడిపోయింది. అదే సమయంలో మార్క్ జుకర్‌బర్గ్ స్వంత సంపద కూడా $ 24 బిలియన్ల తగ్గిపోయింది.

ఫేస్‌బుక్‌ పేరెంట్‌ కంపెనీ Meta Platforms Inc క్యూ 3లో దారుణమైన ఆదాయాలను నమోదుచేయడంతో గురువారం మెటా షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. మెటా ఒక్కరోజే 251 బిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. మెటా షేర్లు భారీగా పతనమవ్వడంతో జుకమ్‌బర్గ్‌ నికర ఆస్తుల విలువ కూడా భారీగా తగ్గిపోయింది. జుకర్‌బర్గ్ నికర విలువలో 29 బిలియన్‌ డాలర్లను కోల్పోయారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. మెటా వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుకర్‌బర్గ్ నికర విలువ 85 బిలియన్ల డాలర్లక పడిపోయింది . ప్రస్తుతం భారత కుబేరులైన ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ ఆదాయి సైతం జుకర్‌బర్గ్‌ కంటే ముందున్నారు. మోట నాలుగో త్రైమాసికానినికి $ 10.3 బిలియన్ల లాభాన్ని నివేదించింఇ. ఇది విశ్లేషకుల అంచనాల కంటే $ 10.9 బిలియన్ల కంటే తక్కువగా ఉంది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే స్వల్ప క్షీణతను నమోదు చేసింది.

అదానీ, అంబానీకి కలిసి వచ్చింది..

మెటా షేర్లు పడిపోవడంతో భారతీయ బిలియనీర్స్‌ అదానీ, అంబానీలకు కలిసొచ్చింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా వివరాల ప్రకారం, అదానీ నికర విలువ 90.1 బిలియన్‌ డాలర్లు ఉండగా, అంబానీ నికర ఆస్తుల సంపద విలువ 90 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక నవంబర్‌ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ సింగిల్‌ డేలో 35 బిలియన్ డాలర్లను కోల్పోయిన తరువాత నికర ఆస్తుల విలువను కోల్పోయిన వ్యక్తి జుకర్‌బర్గ్‌ ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

SBI New Rules: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. IMPS పరిమితి పెంపు.. దేనికి ఎంత ఛార్జీ

Train Ticket Discount: రైలులో సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు కాకుండా ఆ వ్యక్తులకు కూడా ఛార్జీలలో రాయితీ.. ఎవరెవరికి అంటే..