AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver Diet: ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే చాపకింద నీరులా..

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా కిడ్నీ, లివర్‌, గుండె వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాటీ లివర్‌లో బాధపడుతున్నారు. నిజానికి ఫ్యాటీ లివర్‌ రెండు రకాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అనియంత్రిత జీవనశైలి కారణంగా ఈ రకమైన వ్యాధి పెరుగుతుంది. అతిగా తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఆల్కహాల్..

Fatty Liver Diet: ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి.. లేదంటే చాపకింద నీరులా..
Fatty Liver Diet
Srilakshmi C
|

Updated on: Oct 15, 2023 | 8:57 PM

Share

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. ముఖ్యంగా కిడ్నీ, లివర్‌, గుండె వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాటీ లివర్‌లో బాధపడుతున్నారు. నిజానికి ఫ్యాటీ లివర్‌ రెండు రకాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అనియంత్రిత జీవనశైలి కారణంగా ఈ రకమైన వ్యాధి పెరుగుతుంది. అతిగా తాగడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఆల్కహాల్ తాగకపోయినా, ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ వ్యాధిని అభివృద్ధి చేయవచ్చు. దీనిని నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వ్యాధి అంటారు. నిజానికి.. ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు ఏమి తినాలి, ఏమి త్రాగాలి అనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు. ఈ సమయంలో తీసుకోవల్సిన ఆహార జాగ్రత్తల గురించి ఆరోగ్య నిపుల మాటల్లో మీకోసం..

కూరగాయలు

కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పాలీఫెనాల్, నైట్రేట్ సమ్మేళనాలు కూడా వీటిల్లో ఉంటాయి. అందువల్ల కూరగాయలు తినడం ద్వారా శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించి కాలేయంలో కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.

పప్పులు

పప్పు దినుసులు ప్రొటీన్లకు మూలం. పప్పులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో పప్పులు కూడా సహాయపడతాయి. అలాగే జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

సముద్ర చేప

పాంఫ్రెట్, హాలిబట్ వంటి సముద్ర చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే లివర్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఈ రకమైన పండ్లు కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను శరీరం నుంచి తొలగించడంలో సహాయపడతాయి. నిమ్మకాయలు, బత్తాయి, నారింజ వంటి పండ్లు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పుల్లని పెరుగు

పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

కారం తినడం తగ్గించాలి

స్పైసీ ఫుడ్ తినడం వల్ల మీ లివర్ దెబ్బతింటుంది. కానీ అనేక మసాలా దినుసులు ఉన్నాయి, వీటిని రోజువారీ ఆహారంలో ఉంచుకుంటే కొవ్వు కాలేయ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో పచ్చి పసుపు కూడా ఉంటుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం మిమ్మల్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.

ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి..

వీరికి చక్కెర విషంతో సమానం. ఇది నెమ్మదిగా ఆరోగ్యాన్ని హరిస్తుంది. షుగర్ ఫుడ్స్ కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ ఫ్యాటీ లివర్ సమస్యలను పెంచుతాయి. అలాగూ కొవ్వు కాలేయ సమస్యతో బాధపడేవారు వేయించిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. బయటి ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఉప్పు వినియోగం కూడా తగ్గించాలి. ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు రెడ్ మీట్ తినకూడదు. ఇది తీవ్రమైన కాలేయ నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ని ఆల్కహాల్‌తో నయం చేయలేము. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లో కూడా మద్యం సేవించడం మంచిది కాదు. ఈ అలవాటును మార్చుకోకపోతే అది తీవ్రమైన కాలేయా హానికి దారి తీస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.