Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Woman Saree Style : సనాతన ధర్మంలో భారతీయ మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని తెలుసా..!

: భారతీయ సంప్రదాయంలో మహిళలు ధరించే చీర అత్యంత ప్రాముఖ్యత కల్గింది. ఈ చీరకు ఎంతో చరిత్ర ఉంది.. వేదాల్లోనూ, రామాయణ, మహాభారతాల్లోనూ కూడా చీర గురించి చెప్పబడింది. ఇక చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి...

Indian Woman Saree Style : సనాతన ధర్మంలో భారతీయ మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని తెలుసా..!
Indian Women Saree Style
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2021 | 3:18 PM

Indian Woman Saree Style  : భారతీయ సంప్రదాయంలో మహిళలు ధరించే చీర అత్యంత ప్రాముఖ్యత కల్గింది. ఈ చీరకు ఎంతో చరిత్ర ఉంది.. వేదాల్లోనూ, రామాయణ, మహాభారతాల్లోనూ కూడా చీర గురించి చెప్పబడింది. ఇక చంద్రగుప్తుని కాలంలో పాటలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి “బంగారు జరీతో విలువైన రాళ్ళు పొదగబడినవి” అని వ్రాశాడు. అతంటి విశిష్టతను సొంతం చేసుకున్న చీరకట్టు మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరకంగా ఉంటుంది. అయితే సనాతన ధర్మంలో మహిళ చీర ధరించడానికి శాస్త్రీయ కోణం కూడా ఉందని కొంతమంది శాస్త్ర పరిశోధకులు చెప్పారు. అవి ఏమిటో చూదాం.. :

ప్రతి మనిషి శరీరంలో శక్తి మరియు చైతన్యం హన్మాన్ రెండు ముఖ్యమైన అంశాలు. శక్తిని స్త్రీ స్వభావంగా చైతన్యాన్ని పురుషుడిగా పరిగణిస్తారు. అయితే మన శరీరంలో, భూమిలో, విశ్వంలో ఆరోగ్యకరమైన శక్తి కదలికలు ఒకే విధంగా ఉంటాయి. ఇవి వృత్తాల్లో కదులుతాయి. అందుకే స్త్రీ శరీరం మరింత వంకరగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకని స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలోని శక్తులు వృత్తాకార కదలికలో కదులుతూ ఉండాలి. మన శరీరం వైపు వచ్చే ఏదైనా శక్తి మొదట మన బట్టలను తాకి, ఆపై అది శరీర భాగాలలోకి, దాని శక్తి మార్గాల్లోకి, తరువాత అంతర్గత అవయవాలకు ప్రవేశిస్తుంది.

*చీర స్త్రీ శరీరం చుట్టూ వృత్తాకార కదలికలో ధరిస్తారు. ఇది దాదాపు చివరి వరకు ప్రదక్షిణ చేస్తుంది. కాబట్టి ఒక శక్తి చీరను తాకినప్పుడు, అది శరీరం చుట్టూ ఉన్న వృత్తాలలో ప్రయాణిస్తుంది, ఇది శక్తిని సరైన మార్గంలో తరలించడానికి సహాయపడుతుంది. *శక్తి 5-6 గజాల వస్త్రంలో ప్రయాణించేటప్పుడు, లోపలికి వచ్చే ప్రతికూల శక్తులు వస్త్రంలో చిక్కుకుంటాయి. అవి చీరను ఉతికిన సమయంలో శుభ్రమవుతాయి. *మనదేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించినా సింథటిక్స్ పెద్ద ఎనర్జీ బ్లాకర్స్ వంటివి ఆరోగ్యానికి చాలా హానికరం. లైక్రా మరియు సింథటిక్ ఫైబర్‌లతో చేసిన అన్ని ఫిట్‌నెస్ దుస్తులు ఆరోగ్యానికి మంచివి కావు. అందుకనే మనపెద్దలు నూలు, పత్తి పట్టు వంటి సహజమైన పద్దతుల్లో తయారు అయిన వస్త్రాలనే ధరించే వారు.

Also Read: మంత్రాల పేరుతో రూ. 26 కోట్ల మోసం.. సీనియర్ నటిమణి కొడుకు అరెస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..

ట్రాక్టర్​ను ఈ రైతు ​ బుల్లెట్​ ప్రూఫ్​గా మార్చేశాడు.. కారణం చాలా పెద్దదేనండోయ్.. ఇవిగో వివరాలు