Rice Pulling: మంత్రాల పేరుతో రూ. 26 కోట్ల మోసం.. సీనియర్ నటిమణి కొడుకు అరెస్ట్.. పోలీసులు ఏం చెప్పారంటే..
Rice Pulling: సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రేష్‌ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన వద్ద..
Rice Pulling: సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రేష్‌ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన వద్ద అద్భుతాలు సృష్టించే వస్తువు ఉందని నమ్మబలికి చెన్నైలోని వలసరవాక్కం కు చెందిన నెడుమారన్‌ను రూ. 26 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు అమ్రేష్, అతని స్నేహితులు 2013 నుంచి నెడుమారన్(68)ను మోసం చేస్తూ వస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా అతనికి మాయ మాటలు చెబుతూ డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన వద్ద ప్రభావవంతమైన కలశం ఉందని, అది ఇంట్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయని నమ్మబలికారు. ఆ యంత్రంతో జీవితమే మారిపోతుందని ఊదరగొట్టాడు. అమ్రేష్ చెప్పిన మాటలు నమ్మిన నెడుమారన్.. అమ్రేష్‌కు భారీగా డబ్బులు ఇచ్చి కలశాన్ని తీసుకున్నాడు. అయితే కొంతకాలం పాటు కలశాన్ని ఇంట్లో పెట్టుకున్న నెడుమారన్.. దీని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించాడు. తనను అమ్రేష్ మోసం చేశాడని గుర్తించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అమ్రేష్ సహా అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఎగ్మూరులోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో అమ్రేష్‌ను హాజరుపరుచగా.. కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.
ఇదిలాఉంటే.. సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అయిన అమ్రేష్.. 2010 లో విడుదలైన ‘నానే ఇల్లాయ్’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. అలా పలు తమిళ సినిమాల్లో నటించాడు. అంతేకాదు.. ‘మోటా శివ కెట్టా శివ’, ‘భాస్కర్ ఓరు రాస్కల్’, ‘చార్లీ చాప్లిన్ 2’ సహా పలు సినిమాలకు పాటలు కూడా కంపోజ్ చేశారు.
Also read:
Milk Powder Ladoo : చిటికె లో మిల్క్ పౌడర్ తో లడ్డు తయారీ.. తిన్నారంటే దీని రుచి మరిచిపోవడం కష్టం
Corona Effect: ఏడాది కాలంలో తొలి హగ్.. వృద్ధ దంపతుల భావోద్వేగం.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..