Milk Powder Ladoo : చిటికె లో మిల్క్ పౌడర్ తో లడ్డూ తయారీ.. తిన్నారంటే దీని రుచి మరిచిపోవడం కష్టం

మిల్క్ పౌడర్ ను ఎక్కువగా కాఫీ టి తయారీకి మాత్రమే ఉపయోగిస్తారు.. అయితే ఈ పాల పొడి తో నోరూరించే స్వీట్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మిల్క్ పౌండర్ తో లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం..!

Milk Powder Ladoo : చిటికె లో మిల్క్ పౌడర్ తో లడ్డూ తయారీ.. తిన్నారంటే దీని రుచి మరిచిపోవడం కష్టం
Milk Powder Ladoo
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 18, 2021 | 3:54 PM

Milk Powder Ladoo : ఎండిన పాలను పొడిబారిన పాలను ఆవిరి చేయడం ద్వారా మిల్క్ పౌడర్ తయారు చేస్తారు. ఈ పౌడర్ ఇన్స్టెంట్ గా ఎక్కువగా బజార్లలో లభ్యమవుతుంది. అయితే ఈ మిల్క్ పౌడర్ ను ఎక్కువగా కాఫీ టి తయారీకి మాత్రమే ఉపయోగిస్తారు.. అయితే ఈ పాల పొడి తో నోరూరించే స్వీట్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మిల్క్ పౌండర్ తో లడ్డు తయారీ విధానం తెలుసుకుందాం..!

మిల్క్‌ పౌడర్‌ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్ధాలు :

మిల్క్‌ పౌడర్‌ – 1 కప్పు, చిక్కటి పాలు – పావు కప్పు (కాచి చల్లార్చినవి), పంచదార – పావు కప్పు, నెయ్యి – కావాల్సినంత ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (అప్షనల్ )

మిల్క్‌ పౌడర్‌ లడ్డూ తయారీ :

ముందుగా మందపాటి గిన్నె తీసుకుని దానిని గ్యాస్ స్టౌ మీద చిన్న మంట మీద వేడి చేయాలి.. తర్వాత అందులో కొంచెం నెయ్యి.. పాలు , పంచదార వేసుకోవాలి.. తర్వాత పంచదార కరిగే వరకూ గరిటెతో తిప్పుటూ ఉండాలి.. చిన్న మంట మీద ఉంచి.. పంచదార పాలలో కొద్దికొద్దిగా మిల్క్‌ పౌడర్‌ వేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా ముద్దలా అయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకుని, ఒక భాగాన్ని తీసి పక్కన పెట్టుకుని.. మరో భాగాన్ని పాన్‌లోనే ఉంచి మిగిలిన నెయ్యి వేసుకుని బాగా తిప్పాలి. తర్వాత ఫుడ్‌ కలర్‌ వేసుకుని బాగా కలిపి.. పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు మొదటిగా తీసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్‌ చేసుకుని.. వాటిపైన ఫుడ్‌ కలర్‌ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని ఒక్కోబాల్‌ చుట్టూ పెట్టుకుని.. నిమ్మకాయ సైజ్‌లో లడ్డూలు చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాలపొడి లడ్డు రెడీ..

Also Read:  ఇంటర్‌తో ఆర్మీలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..

 మానసిక ప్రశాంతతనిచ్చి.. ఉత్తేజం కలిగించడానికి చేయండి ప్రాణాయామా..